తలచినదే జరిగినదా
మనసే మందిరం (1966)
గాత్రం: పి.బి.శ్రీనివాస్
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
పల్లవి:
తలచినదే జరిగినదా...
దైవం ఎందులకు?
జరిగినదే తలచితివా...
జరిగినదే తలచితివా...
శాంతి లేదు నీకు...
తలచినదే జరిగినదా...
దైవం ఎందులకు?
జరిగినదే తలచితివా...
జరిగినదే తలచితివా...
శాంతి లేదు నీకు...
ముగిసిన గాథ మొదలిడదు
దేవుని రచనలలో
మొదలిడు గాథ ముగిసేదెపుడో
మొదలిడు గాథ ముగిసేదెపుడో
మనుజుల బ్రతుకులలో..
తలచినదే జరిగినదా...
దైవం ఎందులకు?
జరిగినదే తలచితివా...
జరిగినదే తలచితివా...
శాంతి లేదు నీకు...
ఏమౌనో మన కలలు
మనసునకెన్నో మార్గాలు
కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో
ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిన నాడు
మనసే ఒక స్వర్గం
ఒకరుండగ వేరొకరొచ్చారా
ఒకరుండగ వేరొకరొచ్చారా
లోకం ఒక నరకం
చరణం2:
ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం
ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం
ఎది అనురాగం ఎది ఆనందం
బ్రతుకునకేది గమ్యం
ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం
ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం
ఎది అనురాగం ఎది ఆనందం
బ్రతుకునకేది గమ్యం
మనదన్నది మాటేదే
ఇది సహజం ఇది సత్యం
ఇది సహజం ఇది సత్యం
ఎందులకీ ఖేదం