తాధిమి తకధిమి తోల్ బొమ్మా
చిత్రం: బంగారు పాప (1954)
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీతరచయిత : బాలాంత్రపు రజనీకాంతరావు
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం
పల్లవి:
ఆయి ఆయి ఆయి ఆపదలు గాయి..ఈ..ఈ
ఆ!
తా ధిమి తక ధిమి తోల్ బొమ్మా
దీని తమాస చూడవే కీల్ బొమ్మా
దీని తమాస అహహహహ
దీని తమాస చూడవే మాయబొమ్మా
ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మాలాటమ్మా
ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మాలాటమ్మా
తళాంగు తక ధిమి తోల్ బొమ్మా
తోం తకతై తకతై అహహహహ
తోం తకతై తకతై మాయబొమ్మా
ఆయీ... ఆయి ఆయి ఆయి
ఆపదలు గాయీ... ఆపదలు గాయి
చరణం 1:
తకతై తకతై మాయ బొమ్మ
నాలుగు దిక్కుల నడిసంతలో తూగే తుళ్ళే తోల్ బొమ్మా
తూగే తుళ్ళే కీల్ బొమ్మా
ఎవరికెవ్వరు యేమౌతారో యివరం తెలుసా కీల్ బొమ్మా
ఈ యివరం తెలుసా మాయబొమ్మ
తళాంగు తకధిమి తోల్ బొమ్మా
తోం తకతై తకతై మాయబొమ్మా
చరణం 2:
కోపం తాపం క్రూర కర్మలు కూడని పనులే తోల్ బొమ్మా
కూడని పనులే కీల్ బొమ్మా
పాపపు రొంటిని పడబోకే పరమాత్ముని నమ్మవే కీల్ బొమ్మా
పాపపు రొంటిని పడబోకే పరమాత్ముని నమ్మవే కీల్ బొమ్మా
ఆటన్నా పాటన్నా పరమాత్ముని బొమ్మాలాటన్నా