January 1, 2020

ఓ మనసా తొందర పడకే



ఓ మనసా తొందర పడకే
ఒక చిన్న మాట (1997)
సాహిత్యం:- భువనచంద్ర
సంగీతం:- రమణి భరద్వాజ్
గానం:- బాలు, చిత్ర

ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
వరమిచ్చిన దేవుని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందరఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
చిరునవ్వుల దేవిని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర

చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

తాజా గులాబి కన్నా
మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా
తన తలపే నాకు మిన్న

వేదాల ఘోష కన్నా
చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే
తన మనసే నాకు మిన్న

మోహం, తొలి మోహం
కనుగీటుతున్న వేళ

రాగం, అనురాగం
ఎదపొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట

చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

నాలోని ఆశ తానై
తనలోని శ్వాస నేనై
రవలించు రాగమేదో
పలికింది ఈ క్షణాన

నా కంటి పాప తానై
తన గుండె చూపు నేనై
పాడేటి ఊసులన్ని
మెదిలాయి ఈ క్షణాన

గాలి, చిరుగాలి
కబురైనా చేర్చలేవా

చెలిని, నెచ్చెలని
ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన

చెప్పవయ్య చెప్పవయ్య ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట