ఉండాలీ నీ గుండెల్లో..
చిత్రం : విజేతలు (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
చిగురాశలే ఊరించనా
సిరి తేనెలే ఒలికించనా
రాగాలు నే పంచనా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగాపూలగంధాలు పలికేను నేడు ముద్దు మురిపాలనే
పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు ఊరించెనే
సందె వెలుగుల్లో నయనాలు నేడు సుధలు చిలికించవా
రాగతీరాల దరిచేరి కదిలే ఎదలు పులకించవా
ఏవేవో ఆశలు పూచే ఏకాంతా వేళా
గారాలా బంధాలన్ని కదిలేటీ వేళా
వంత పాడిందీ ప్రేమ బంధం
లేదంట ఈ సాటి యోగం
ఉండాలీ నీ గుండెల్లో నేనే నీవుగా
జన్మ జన్మాల నా తోడు నీడై నీవు ఉండాలిలే
చెలికి నీ చెలిమి కావాలి చూడు నీవు నా ఊపిరే
నింగి ఈ నేల స్థితి మారుతున్నా స్నేహమే మారునా
కాలగతులన్ని మారేను గాని హృదయమే మారునా
ఉంటానూ నీతో నేను నీ తలపే వేదం
నాదేలే నీలో సర్వం నీ పిలుపే నాదం
మనదిలే ఇంక ప్రేమ లోకం
ఇది కాదె రాగానురాగం
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
చిగురాశలే ఊరించనా
సిరి తేనెలే ఒలికించనా
రాగాలు నే పంచనా
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా