January 1, 2020

పిల్ల ఓ పిల్లా



పిల్ల ఓ పిల్లా
మనువు-మనసు (1973)
అశ్వద్ధామ
ఉషః శ్రీ
బాలు

పిల్ల ఓ పిల్లా
పిల్ల ఓ పిల్లా
పిలుపు వినవేలా
పిలిచి పిలిచి నేనూ అలసిపోవాలా?

పిల్ల ఓ పిల్లా
పిల్ల ఓ పిల్లా
పిలుపు వినవేలా
పిలిచి పిలిచి నేనూ అలసిపోవాలా?

పిల్లనగ్రోవి పిలుపు వినగానే
అల్లన భామా ఉల్లము పొంగా
పిల్లనగ్రోవి పిలుపు వినగానే
అల్లన భామా ఉల్లము పొంగా
గోపాలుని చేరి మురిసిపోలేదా చెలి రాధా...
నీవు రావేలా మనసు మెరిసేలాపిల్ల ఓ పిల్లా
పిల్ల ఓ పిల్లా
పిలుపు వినవేలా
పిలిచి పిలిచి నేనూ అలసిపోవాలా?

నింగిలో మబ్బూ తొంగిచూడగానే
పొంగిన నెమలి నాట్యమాడు కాదా
నింగిలో మబ్బూ తొంగిచూడగానే
పొంగిన నెమలి నాట్యమాడు కాదా
నేను కోరేదీ నిన్నే కాదా
జాలి లేదా?
నీవు రావేలా మనసు మెరిసేలా

పిల్ల ఓ పిల్లా
పిల్ల ఓ పిల్లా
పిలుపు వినవేలా
పిలిచి పిలిచి నేనూ అలసిపోవాలా?

పున్నమి వెన్నెల జాలువారగానే
కలువ కన్నె పులకరించిపోదా?
పున్నమి వెన్నెల జాలువారగానే
కలువ కన్నె పులకరించిపోదా?
వలపు నెరుగలేవా మనసు నీవా?
చేరరావా?
నీవు రావేలా మనసు మెరిసేలా

పిల్ల ఓ పిల్లా
పిల్ల ఓ పిల్లా
పిలుపు వినవేలా
పిలిచి పిలిచి నేనూ అలసిపోవాలా?