November 26, 2021

తెలుగు సినిమా పాటల్లో ముక్తపదగ్రస్తాలంకార ప్రయోగం

ముక్తపదగ్రస్తాలంకారం:
ముక్తం-విడిచిపెట్టిన పదం, గ్రస్తం-తిరిగి స్వీకరించడం. అంటే ఒక పాదంలో ఉపయోగించిన చివరి పదాన్ని తరువాతి పాదం మొదట్లో తిరిగి ఉపయోగించడం. 

ఉదాహరణ: 

తీర్థ సంవాసు లేతెంచినారని నిన్న నెదురుగా నేగు దవ్వెంతయైన, (అల్లసాని పెద్దన, మనుచరిత్రము.)
నేగి తత్పదముల కెరగి ఇంటికి దెచ్చు, 
దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, 
నిచ్చి ఇష్టాన్న సంతృప్తులుగా జేయు, 
జేసి కూర్చున్నచో జేర వచ్చు, 
వచ్చి ఇద్దరగల్గు వనధిపర్వత సరి తీర్థ మహాత్మ్యముల్ దెలియ నడుగు, 
నడిగి యోజన పరిమాణ మరయు, 
నరసి పోవలయుజూడ ననుచు, నూర్పులు నిగుడ్చు.

పన్నెండు గుర్రాల బగ్గి పోతాంది (తెలంగాణా జానపదం)
బగ్గితో మేనత్త బిడ్డ పోతాంది
బిడ్డతో బిందెడు నీళ్ళు పోతున్నాయి 
నీళ్ళతో నీరంచు చీర పోతాంది
చీరతో చిక్కుల రైకె పోతాంది
రైకెతో రత్నాల పేరు పోతాంది 
పేరుతో పెట్టెడు సొమ్ము పోతాంది  
సొమ్ముతో సోమంద గరిగె పోతాంది (పిడత)
గరిగెతో గంధపు చెక్క పోతాంది 
చెక్కతో చారెడు బుక్క పోతాంది
బుక్కతో బుడ్డెడు నూనె పోతాంది
నూనెతో నూరు సకినాలు పోతున్నాయి. 

కాకి కాకి కడవల కాకి (చిన్నపిల్లల తెలుగు రైమ్)
కాకి నోట్లో దీపం పెడితే 
దీపం తీసుకెళ్ళి దిబ్బకిస్తే 
దిబ్బ నాకు గడ్డి ఇస్తే 
గడ్డి తీసుకెళ్ళి ఆవుకిస్తే 
ఆవు నాకు పాలు ఇస్తే 
పాలు తీసుకెళ్ళి పంతులుకిస్తే 
పంతులు నాకు పద్యం చెబితే 
పద్యం తీసుకెళ్ళి మామకు చెబితే 
మామ నాకు పిల్లనిస్తే 
పిల్ల పేరు మల్లెమొగ్గ...నాపేరు జమీందార్....

కాళ్ళాగజ్జా కంకాళమ్మ (చిన్నపిల్లల తెలుగు రైమ్)
వేగుచుక్కా వెలగామొగ్గ
మొగ్గా కాదు మోదుగ నీరు
నీరూ కాదు నిమ్మలబావి
బావీ కాదు బచ్చలికూర
కూరా కాదు గుమ్మడిపండు
పండూ కాదు పాపాయి కాలు
కాలూ తీసి కడగా పెట్టు.  

​​చందమామ చందమామ ఓ చందమామా (సంక్రాతి గొబ్బిళ్ళ పాట)
చందమామ చందమామ ఓ చందమామ
చందమామ కూతుళ్ళు నీలగిరి కన్యలు
నీలగిరి కన్యలకు నిత్యమల్లె తోట
నిత్యమల్లె తోటలోన నిర్మల్ల బావి
నిర్మల్ల బావికి గిలకల్ల తాడు
గిలకల్ల తాడుకి బుడికి బుడికి చెంబు
బుడికి బుడికి చెంబంటే అందరికి మనస్సు
అందరికి మనసంటే నేనివ్వలేను
నేనివ్వ లేనంటే నా చెల్లి ఇచ్చు
నా చెల్లి నాకంటే కడు ముద్దురాలు.
చందమామ చందమామ ఓ చందమామా

ఇదే పాటను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇలా పాడుకునేవారు ...

గొబ్బియెళ్ళో చందమామ చందమామ చందమామ... ఓ చందమామ
చందమామకు పిల్లాలెందరు?  నీలగిరి కన్యలందరు
నీలగిరి కన్యలకు...నిత్యమల్లె తోటలంట
నిత్యమల్లె తోటలోనా... మంచినీళ్ళ బావులంట
మంచినీళ్ళ బావులకు ... మల్లెల్ల తాడు 
మల్లెల్లతాడుకు గిలకల్ల చెంబు
గొబ్బియెళ్ళో చందమామ చందమామ చందమామ... ఓ చందమామ 
అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసితెలిసీ నేనేల రావలె...?
వచ్చితిమి పో  దివ్యరత్న ప్రభాసముపేతమై సర్వతృసంశోభితమైన ఆ మయసభా భవనము మాకేలవిడిదికావలె?
అయినది పో... అందు చిత్ర చిత్తిత విచిత్ర లావణ్యహరులలొ ఈదులాడు జిఘృక్షాపేక్ష మాకేల కలుగవలె...?
కలిగినది పో..సజీవ జలచర సంతాన వితానముల కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలుమోపవలె...?
మోపితిమి పో...సకల రాజన్య కోటీరకోటీతతోక్షిప్త రత్నప్రభానీరాజితమగు మా పాదపద్మమేల అపభ్రంశమందవలె...యేతత్ సమయమునకే పరిచారికాపరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె... వీక్షించవలె...పరిహసించవలె...హా ధిక్... హా ధిక్... హా హతవిధీ...!(కొండవీటి వేంకటకవి, దానవీరశూరకర్ణ)

తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు:

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

మాటరాని మౌనమిది (మహర్షి, వెన్నెలకంటి)
మౌనవీణ గానమిది 
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది 
ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది

అందరాని కొమ్మ ఇది.. 
కొమ్మచాటు అందమిది
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, (సిరిసిరిమువ్వ)
గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది
పున్నాగ తోటల్లో సన్నాయి పాడింది (వియ్యాలవారి కయ్యాలు)
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
నిద్దుర లేచిన పొద్దులలో (ప్రేమ మందిరం)
పొద్దులు మరిచిన పొందులలో 

మబ్బులు విడివడి... మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాంతంలో...
చంద్రోదయం... చంద్రోదయం..
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు....( ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి, వరుడు)
వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది (గోరింటాకు)
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం

కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం.. అందుకే ధ్యానం అందుకే మౌనం 
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే (సీతారామయ్యగారి మనవరాలు)
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే

అనుకోని రాగమే అనురాగదీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......
కన్ను కన్ను మాటాడంగ ...(ప్రజారాజ్యం)
మాట మాట మనసివ్వంగ 
మనసు మనసు మనువాడంగ... రావే..హే..హో..హ్హ..
అ.. మన పెళ్ళికీ..ఈ..హ్హో..మదే పల్లకీ..

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...ఓ...ఓ...
మువ్వా మువ్వా ముద్దాడంగ...ముద్దు ముద్దూ పెళ్ళాడంగ
అందాలన్నీ అల్లాడంగ...రావే..హో..హో..హో...
దాస్తే చూస్తావు (గుంతలకిడి ఘుమ....అశ్వమేధం)
చూస్తే దోస్తావు అల్లాడు అందాలు హొయ్...
కుడి ఎడమ 
ఎలదేటిపాటా చెలరేగె నాలో .... (పంతులమ్మ)
చెలరేగిపోవే మధుమాసమల్లే

మరుమల్లె తోటా మారాకు వేసే...  
మారాకు వేసే నీ రాకతోనే
పడుచందం పందిరివేస్తా..(హేమా హేమీలు)
పందిట్లో విందులు చేస్తా..
పడుచందం పందిరివేస్తా..
పందిట్లో విందులు చేస్తా..

ఏ..ఊరు..నీదే ఊరు..
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి....... కలలే (సుమంగళి, ఆత్రేయ)
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి.......... మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి........ మనువూ.. 
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి........ సంసారం..
ఏం పిల్లది ఎంత మాటన్నది (అల్లరి ప్రియుడు)
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది
అనగనగా ఆకాశం ఉంది, (సిరివెన్నెల, నువ్వేకావాలి)
ఆకాశంలో మేఘం ఉంది, 
మేఘం వెనుక రాగం ఉంది, 
రాగం నింగిని కరిగించింది,
కరిగే నింగి చినుకయ్యింది, 
చినుకే చిటపట పాటయ్యింది, 
చిటపట తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది
రాచిలక నువ్వే కావాలి....
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం (దొంగ-దొంగ, రాజశ్రీ)
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం
కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
ఎండల్లో..కొబ్బరాకు నీడల్లో పండుకొంటే (గజదొంగ)
ఎండల్లో..కొబ్బరాకు నీడల్లో పండుకొంటే
చీరకెన్ని చారలంటడు.. 
నీ చీరకెన్ని మూరలంటడు 
ఈ మూరకెన్ని ముద్దులంటడు
అంటడు అంటడు అంటావే..
ఇరు మనసుల కొక తనువై (అడవి రాముడు)
ఇరు తనువుల కొక మనువై 
మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై
కలిసివున్న నూరేళ్లు కలలుగన్న వెయ్యేళ్లు
మూడుముళ్లు పడిన నాడు ఎదలు పూలపొదరిళ్లు
గోదారి గట్టుందీ..  (మూగ మనసులు, దాశరథి)
గట్టుమీన సెట్టుందీ
సెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది.. ఓ ఓ ఓ ఓ.. హోయ్..
వానేమి చేస్తుంది వయసుండగా.. (యుగ పురుషుడు, ఆత్రేయ)
వయసేమి చేస్తుంది జత ఉండగా
జతకుదిరి తీరాలి చలి ఉండగా.. 
చలిమంట ఎందుకు నేనుండగా
అహ... గాలి మళ్లింది నీ పైన.. 
గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది.. 
ఆపైన అడగకు ఏం జరిగినా...
కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే (స్టూడెంట్ నం 1, చంద్రబోస్)
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే
చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే
ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే

కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే
కొట్టినవాడే దగ్గర జరిగే (కొమరం పులి, చంద్రబోస్)
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే 
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..
ఇందులో ఇంకొక విధమైన అలంకారము కలదు. దాన్ని "సింహావలోకన ముక్త పద గ్రస్తం" అంటారు. అందులో  మొదటి పాదంలోని మొదటి పదం ఏదయితే ఉందో....అదే చివరి పాదంలోని చివరి పదంగా కూడా వస్తుంది. 
 
ఉదాహరణ:

మనవేటికి నూతనమా? (కావ్యాలంకార సర్వస్వం, విద్వాన్ తెన్నేటి)
తనమానిని; ప్రేమ తనకు దక్కితి ననుమా,
ననుమానక దయ దనరం 
దనరంతులు మాని సరస ధవురమ్మనవే

కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల (మూగ మనసులు, ఆత్రేయ)
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల