January 1, 2020

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు



ఊహల పల్లకిలో
ఆమె (1994)
విద్యాసాగర్
బాలు, చిత్ర
సిరివెన్నెల 

పల్లవి: 

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు
కాటుకా.. 
అది నీలిమేఘ చారికా.. 
తిలకమా..
పురి విప్పిన మన్మథభాణమా
ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు
చిరు చిరు పెదవులపై ఊ..రుతున్నదీ మధువు
చరణం 1:

ఉదయ సంథ్య వేళలో 
చిలిపి చల్లగాలిలో
అరుణకిరణ ధారనై 
ఒడిని చేరనా...ఓఓఓ..

వెండి మబ్బునీడలో 
వెన్నెలమ్మ మేడలో
కన్నెజాజి పువ్వునై కౌగిలించనా...ఓఓఓ..

పరువాల పొదివిలోనా నెరజాణ 
తమకాల తెరతీయనా
అధరాల కలయికలోన మృదువీణ 
గమకాలు జతచెయ్నా
తనువు నీది తలపు నాది
ధిరణ ధిరణ ధిరణ ధిరణ నా..

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ ఈ మనసు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు

చరణం 2:

నిలువనీయనన్నదీ 
నిదుర మానుకున్నదీ
నిన్ను చేరమన్నదీ 
కన్నెప్రాయము... ఓఓఓ...

వేళకాని వేళలో 
దారి కాని దారిలో
వయసు వేణువైనదీ 
ఎంత చిత్రమో... ఓఓఓ..

సరసాల సరిగమలోన 
చెలికాడ శృతులేవో సరిచెయ్యనా..

మధనాల మధురిమలోన 
మురిపాల శిఖరాలు చూపెయ్నా

తనువు నాది తలపు నీది
ధిరణ ధిరణ ధిరణ ధిరణ నా..