Showing posts with label కె.కె. Show all posts
Showing posts with label కె.కె. Show all posts

నీకోసం నీకోసం నీకోసం


నీకోసం నీకోసం నీకోసం
చిత్రం : నేనున్నాను (2004)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె, శ్రేయా ఘోషాల్

పల్లవి: 

వేసంకాలం వెన్నెల్లాగా 
వానల్లొ వాగుల్లాగ 
వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి 
ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ 
సంక్రాతి పండుగలాగ 
సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి 
ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా 
నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం 
నీకోసం నీకోసం నీకోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడివేళ 
ఆకూ వక్కా సున్నం
నీకోసం నీకోసం నీకోసం 
నీకోసం నీకోసం నీకోసం

కొండకాకి కొండే దానా



కొండకాకి కొండే దానా
అపరిచితుడు (2005)
హారిస్ జయరాజ్
కేకే, జెస్సి గిఫ్ట్, సుజాత

రండక...రండక
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
కొండకాకి కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
అయ్యార్యెట్టు పళ్ళ దానా
మట్టగిడస కళ్ళ దానా

పూవుల్ తోనే బాణంవేసే
పూలన్ దేవి నువ్వే జాణా...
మాయల మొనగాడే రాతిరి బూచోడే
మంచుగడ్డని ఒక్క లుక్కుతో
ఆవిరి చేసాడే

ఛాయ్ చండి జగమొండి 
జర కొంగును దులపండి
ముద్దులతోనే స్వేదాన్నంతా
శుభ్రంచేయండి

కొండ కాకి కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
అయ్యార్యెట్టు పళ్ళ దానా
మట్టగిడస కళ్ళ దానా
పూవుల్ తోనే బాణంవేసే
పూలన్ దేవి నేనే దానా...

హే..ఛీ..రా అంటూ వాతలు వేస్తావో
హ హ్మ్ హెయ్ అంటూ కులుకించేస్తావో
మిర్చి మసాల నడుమును చూసి
ముడుచుకుపోయానే, తడి పెదవుల్లో
సెగ పుట్టించి ఇస్తిరిచేసెయ్ వే
జగ్గు జగు జంతరగాడా
పప్పు రుబ్బు భీముని చూడ
నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా 
నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా

కొండకాకి కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
అయ్యార్యెట్టు పళ్ళ దానా
దరదరద మట్టగిడస కళ్ళ దానా
పూవుల్ తోనే బాణంవేసే
పూలన్ దేవి నువ్వే జాణా...

వై-జా-గు వెలగపండువే నీవా
1-2-3 పాడీ కొరికేయ్ నా నిన్నూ..
పండు తిని పిల్లగా
పల్లు పుచ్చకుంటా
కరుసుకుపోతావా...
జంట అరటి పండు మల్లే
వెంటే ఉంటావా..
శెట్టోరి కొట్టు పీచు మిఠాయి
పక్కూరి టాకి చెగోడి నువ్వోయి
జున్ను పాలంటి దేహం నీదే చిలకా (2)
కాస్త రుచిచూడనీవే పొమ్మని అనకా (2)

కొండ కాకి కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
అయ్యార్యెట్టు పళ్ళ దానా
మట్టగిడస కళ్ళ దానా
పూవుల్ తోనే బాణంవేసే
పూలన్ దేవి నువ్వే జాణా...

మాయల మొనగాడే రాతిరి బూచోడే
మంచుగడ్డని ఒక్క లుక్కుతో
ఆవిరి చేసాడే
ఛాయ్ చండి జగమొండి 
జర కొంగును దులపండి
ముద్దులతోనే స్వేదాన్నంతా
శుభ్రంచేయండి...
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా

అయామ్ వెరీ సారీ

అయామ్ వెరీ సారీ
చిత్రం : నువ్వే నువ్వే (2002)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె.

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించీ
వదిలెయ్ క్షమించీ..
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ రుతువుకో
డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే
తమాషాగా ట్రైలేసి చూశానే బేబే

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హే అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యూపిల్లా
ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీక ఊరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ...

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించి
వదిలెయ్ క్షమించి