January 11, 2020
నీలోని అందాలు చూసానులే
నీలోని అందాలు
అమ్మాయిలు అబ్బాయిలు (2003)
చక్రి
భాస్కరభట్ల
కౌసల్య, జీన్స్ శ్రీనివాస్
నీలోని అందాలు చూసానులే
తెలిమంచు తెర చాటులో
నాలోని భావాలు తెలిసాయిలే
తొలి ప్రేమ తీరాలలోనువ్వు లేని క్షణమే నాకేమో యుగమే
నీడల్లే నీవెంట నేనే వుంటా
కలలన్ని నిజమై నీలోనే సగమై
కడదాకా విడిపోక నీతో వుంటా
నిను చూస్తూ నను నేనే మరిచానంట
నీలోని అందాలు చూసానులే
తెలిమంచు తెర చాటులో
నాలోని భావాలు తెలిసాయిలే
తొలి ప్రేమ తీరాలలో
చరణం 1:
నిన్నా మొన్నా లేని ఆత్రమా
నిన్ను నన్ను కలిపే మంత్రమా
నీకు నాకు ఇంత దూరమా
నేనే నువ్వయ్యాను చూడుమా
చినుకై నను తాకితే చిగురై పులకించదా
ఏదో అయ్యింది నాలో నువ్వేం చేసావో ఏమో
పెదవంచున చిరునవ్వుగ
నిను చేరేదెలా
చరణం 2:
కళ్ళలోకి నువ్వు చూడిలా
నువ్వు తప్ప వేరే లేరుగా
రాతిరేళ నిదుర రాదుగా
చూడకుంటే నిన్ను నేరుగా
నదిలా నువ్వు మారితే అలలా నిను చేరనా
మైకం కమ్మింది నేడు
ఏకం కమ్మంది చూడు
నడుమొంపులో శృతి చేయగా
నిను తాకేదెలా