పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి, గానం చేసిన పాట.
మన పల్లెటూళ్ళ గొప్పతనం చాటుతుంది.
మనం పుట్టి పెరిగిన ఊరి మధురస్మృతులు మళ్ళీ
ఒక్కసారి గుర్తుచేసే ఈ పాట వినండి.
ఓహొ ఓ...ఓ...ఆ.ఆ...ఆ.ఆ...
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు ||ఒయ్యారి||
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా వదిలి పోలేరు..
||పంట చేల......తిరిగి రావాలి||
పచ్చని పచ్చిక పైనా మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...||పచ్చని||
ఏరు దాటి తోట తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి... ||ఏరు దాటి||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..||2||
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...||చిన్ననాటి||
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...||ఒకరొకరు||
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||
ఓహొ హో...ఓ..ఒ..ఒ..ఒ..ఓ....||2||