జగతి సిగలో...
పరదేశి (1998)
వేటూరి
కీరవాణి
సుజాత
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగిన హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
ఐ లవ్ ఇండియా... ఐ లవ్ ఇండియా...
ఐ లవ్ ఇండియా... ఐ లవ్ ఇండియా...గంగ యమునలు సంగమించిన గానమో...
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో...
అజంతాల... ఖజురహోల...
సంపదలతో సొంపులొలికే భారతి జయహో...
మంగళం మాతరం
ఐ లవ్ ఇండియా... ఐ లవ్ ఇండియా...
ఐ లవ్ ఇండియా... ఐ లవ్ ఇండియా...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజుమహలే ప్రణయ జీవుల పావురం
కృష్ణవేణి శిల్ప రమణి నర్తనం
వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం
ఐ లవ్ ఇండియా... ఐ లవ్ ఇండియా...
ఐ లవ్ ఇండియా... ఐ లవ్ ఇండియా...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం