January 1, 2020

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..


ఎందుకో ఏమిటో
దిల్ (2003)
ఆర్. పి. పట్నాయక్
కులశేఖర్

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ఎందుకో ఎమిటో నిదురింక రాదెమిటో..
కనుపాపలో కల కాదుగా ఈ మాయా..
ఎపుడూలేనిదీ.. నాలో అలజడీ..
ఎవరూ చెప్పలేదే ప్రేమనీ...

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ప్రేమనే మాటకీ అర్ధమే నాకు రాదే..
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే..
నీ జతే చేరగా నా కథే మారిపొయే..
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులె..
చినుకై చేరినా వరదై పోయెనే..
ఎవరూ ఆపలేరే ప్రేమనీ..

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..

గాలిలో వేలితో ఆశలే రాసుకోనా..
నీవనే ప్రేమనీ శ్వాశగా పీల్చనా..
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోనా..
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా..
లోకం ఎంతగా మారిందే ఇలా..
పగలే జాలువారే వెన్నెలా...

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..
ఎందుకో ఎమిటో నిదురింక రాదెమిటో..
కనుపాపలో కల కాదుగా ఈ మాయా..
ఎపుడూలేనిదీ.. నాలో అలజడీ..
ఎవరూ చెప్పలేదే ప్రేమనీ...

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో..
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా..