ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది
రాయలసీమ జానపదగీతం
పాడినవారు: స్వర్ణలత
సంగీతం: జి. ఆనంద్
ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది
మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని
బావా… నన్ను సేరుకోవా!
బావా… నన్నందుకోవా!!
ఊరూ నిదరోయింది|
మరుమల్లె తోటకాడ మల్ల నిన్ను కలుత్తనాని
మాట సెప్పి మరిసీనావే.. బూటకాలు సేసినావే (2)
అత్త కొడుకువనీ…అందగాడివనీ.. కొత్త వలపులను తెచ్చితి రారా
బావా… నన్ను సేరుకోవా!
బావా… నన్నల్లుకోవా!!
జొన్నసేని మంచెపైన నన్ను ముద్దుసేసి శాన (2)
ముద్దబంతి పూలసరమూ మురిపెంగా తెత్తానంటివి(2)
మామకూతురని, మరదలు పిల్లని మాటలోనే ఏమారిసిపోదువా
బావా… నన్ను సేరుకోవా!
బావా… నన్నందుకోవా!!
అర్దరేతిరయిపోతన్నది ఆకాసం ఉరిమేత్తన్నది (2)
ఒళ్ళు సిగలు సెగలైతన్నవి మనసు ఉలికి పడిపోతున్నది (2)
ఓపలేను నే ఒంటిదానిని ఒక్కసారి నా పక్కకు రారా
బావా… నన్ను సేరుకోవా!
బావా… నన్నల్లుకోవా!!
ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది
మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని
బావా… నన్ను సేరుకోవా!
బావా… నన్నందుకోవా!!