January 1, 2020

పందిట్లో పెళ్ళవుతున్నది


పందిట్లో పెళ్ళవుతున్నది 
ప్రేమలేఖలు (1953)
గాత్రం:జిక్కి
సంగీతం:శంకర్ - జైకిషన్

పల్లవి:

పందిట్లో పెళ్ళవుతున్నది
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది
చరణం1:

పెళ్ళికుమార్తెకు పూజఫలము చేతికందేను చేతికందేను
గోరింటాకు పూయెదపూసి గోళ్ళు కందేను నా గోళ్ళు కందేను
కోరికలు తీరుచున్నవి అవి తీరుచున్నవి
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది

చరణం2:

వధువు వరుడు పల్లకిలోన పరదేశమేగెదరు
వధువు వరుడు పల్లకిలోన పరదేశమేగెదరు
వారిని తలచి బంధువులంతా కటకము వగచెదరు ఉ ఉ
కటకము వగచెదరు కన్నీరే కురియుచున్నది
మది కరుగుచున్నది ఒంటరిగా ఆడెదను
ఓ ఒంటరిగా ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
ఒంటరిగా ఆడెదను ఓ ఒంటరిగా ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది