January 11, 2020
పిలిచే మాటున్నా...తీరేనా ఆరాటం
చూసాను ఏదో నీలో
అక్కాచెల్లెలు (1993)
సంగీతం: శ్రీ వసంత్
గానం: మనో, చిత్ర
చూసాను ఏదో నీలో...
దాచాను నిన్నే నాలో...
గుట్టు చెడే వేళ
ముడికట్టు విడే వేళ
సిగ్గు అనే చీర
మగదిక్కునిలా చేరా
గువ్వలచెన్నా...
దాని యవ్వనమొక వెన్నరా
అద్దిరబన్నా...
వాడు నవ్వితె ఇక వెన్నెల
అందమే దోచుకో సందెవేళ
చెలి కోరె ఉడుంపట్టు
బులిపించి భుజం తట్టు
చూసాను ఏదో నీలో...
దాచాను నిన్నే నాలో...
చరణం 1:
పచ్చని పచ్చికలో...
వెచ్చని మచ్చికలో...
పరిచే పైట
పడుచు పాట
అచ్చిక బుచ్చికలో
అల్లరి పిచ్చుకలో
వయసే వాటా
అడిగే జంట
జడలో శ్రీబంతి
ఒళ్ళోనా పూబంతి
ఒడిలో ఓంశాంతి
సందిట్లో సంక్రాతి
అదా సంగతి...!
సరే నెమ్మది
ఆపినా ఆగునా
అగ్గికాముడూ
నువ్వు మల్లెమొగ్గ
నేను కన్నెపాప
అరెరెరే...చూసాను ఏదో నీలో...
దాచాను నిన్నే నాలో...
చరణం 2:
సన్నని చీకటిలో
వెన్నెల వాకిటలో
సరసాలాట...
వరసేనంట...
ముద్దుల ముచ్చటలో...
పొద్దులు పుచ్చుటలో...
కలిసే ఉంటా...
కల కాదంటా...
కురిసే మబ్బున్నా
తడిసేనా ఆకాశం
పిలిచే మాటున్నా
తీరేనా ఆరాటం
అదా సంగతీ
హాయ్...శృతే పెంచకూ
మెత్తనీ ప్రేయసీ
మేనకోడలు
నేను పాలపుంత
నువ్వు సన్నజాజి
చూసాను ఏదో నీలో...
ఓ...
దాచాను నిన్నే నాలో...
ఓ...
గుట్టు చెడే వేళ
ముడికట్టు విడే వేళ
సిగ్గు అనే చీర
మగదిక్కునిలా చేరా
గువ్వలచెన్నా...
దాని యవ్వనమొక వెన్నరా
అద్దిరబన్నా...
వాడు నవ్వితె ఇక వెన్నెల
అందమే దోచుకో సందెవేళ
చెలి కోరె ఉడుంపట్టు
బులిపించి భుజం తట్టూ...