January 1, 2020

ఒకే తోటలోన.. ఒక గూటిలోన


ఒకే తోటలోన.. ఒక గూటిలోన
చిత్రం :  రాముడే దేవుడు (1973)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ
ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ

అవి జతగానే బతకాలని కలగంటు ఉన్నాయి
ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ
చరణం 1 :

చూపులేనిదానికొకటి కాపు ఉన్నదీ..
తోడులేని దాని కొకటి జోడైనదీ
జంట గువ్వ వెంటవుంటే పొంగిపోతదీ..
ఒక్క క్షణం దూరమైతే కుంగిపోతదీ
అది ఏనాటి బంధమో అరెంటిని కలిపిందీ   

ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ...
చేరాయి రెండు గువ్వలూ

చరణం 2 :

తనువులేమొ వేరైనా మనసు ఒక్కటే..
గుండెలేమొ రెండైన ప్రాణమొక్కటే
ఎక్కడ అవి పుట్టాయో తెలియదెవరికి..
ఒక్కటిగా బతకడమే తెలుసువాటికీ
తమ చిన్నారి ఆగూడే కోవెలగా తలచాయి

ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ...
చేరాయి రెండు గువ్వలూ

చరణం 3 :

పూలమాలలో దారం దాగివుంటదీ..
వలపుజంటలో చెలిమి దాగనంటదీ
కలిసి మెలిసి కథలెన్నో  అల్లుకున్నవీ..
అంతులేని ఆశలెన్నో పెంచుకున్నవీ
తన చెలికాడే దేవుడని మనసార తలచిందీ

ఒకే తోటలోన.. ఒక గూటిలోన..
చేరాయి రెండు గువ్వలూ...
చేరాయి రెండు గువ్వలూ