చిరునవ్వు వెల ఎంత
చిత్రం: పగబట్టిన పడుచు (1971)
సంగీతం: యం. రంగారావు
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఓహొహొహో.. ఆహహహా..
ఆహ.. ఏహే.. ఊఁహూ.. ఓహో..
చిరునవ్వు వెల ఎంత.. మరు మల్లె పువ్వంత
చిరునవ్వు వెల ఎంత.. మరు మల్లె పువ్వంత
మరుమల్లె వెల ఎంత.. మరుమల్లె వెల ఎంత..
సిరులేవి కోనలేనంత..
హాఁ.. ఆఁ..
ఓహో.. ఆఁ..
చిరునవ్వు వెల ఎంత.. మరు మల్లె పువ్వంత
చరణం 1:
నీ బుగ్గల మీది గులాబీలు దూసుకోనా
నీ కళ్ళల్లోనా నా నీడ చూసుకోనా
నీ బుగ్గల మీది గులాబీలు దూసుకోనా
నీ కళ్ళల్లోనా నా నీడ చూసుకోనా
గులాబీలు దూసే ముందూ.. చెలి వలపే తెలుసుకో
చెలి వలపే తెలుసుకో..
గులాబీలు దూసే ముందూ.. చెలి వలపే తెలుసుకో
కళ్ళల్లో చూసే ముందూ.. కన్నె మనసు దోచుకో
ఊఁహూ.. హా..
హొయ్..హొయ్.. ఊఁ..
చిరునవ్వు వెల ఎంత.. మరు మల్లె పువ్వంత
చరణం 2:
నా వన్నెలు చూసి నిన్ను నీవే మరిచేవా
మరి ఎన్నడు వీడని తియ్యని బంధం వేసేవా
నా వన్నెలు చూసి నిన్ను నీవే మరిచేవా
మరి ఎన్నడు వీడని తియ్యని బంధం వేసేవా
బ్రతుకంతా నీ కౌగిలిలో.. బందీగా ఉంటాను..
బందిగా ఉంటాను..
బ్రతుకంతా నీ కౌగిలిలో.. బందీగా ఉంటాను..
అనురాగ బంధంలోనా నను నేనే మరిచేను
హాఁ.. హాఁ..
హాఁ.. హొయ్..హొయ్..
చిరునవ్వు వెల ఎంత.. మరు మల్లె పువ్వంత
చిరునవ్వు వెల ఎంత.. మరు మల్లె పువ్వంత
మరు మల్లె వెల ఎంత.. మరు మల్లె వెల ఎంత
సిరులేవి కోనలేనంత..
హాఁ.. ఊఁ..
హాఁ.. హొయ్..
హాఁ.. హాఁహాఁ..
ఉఁ.. హొయ్..హొయ్..