పచ్చి పచ్చి ప్రాయం
చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
కుర్ర కుమారం కూకుంటె నేరం
కుర్ర కుమారం కూకుంటె నేరం
తొంగుంటె ఎట్టాగబ్బయ్యా యా యా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
ఒప్పుకోమ్మా - తప్పులేమ్మా
బుగ్గలిమ్మా - సిగ్గులేమ్మా
పదవే చాటుకు పడుచుదాన
పెదవే కానుకగా
కమ్మని ఒడి ఆ కాముని గుడి
గంటల సడి మా జంటకు పడి
మగువ సొగసు పొగడి
ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
తెల్లచీర - మాయనివ్వు
మల్లె చెండు - పెట్టనివ్వు
సలహా చెప్పకు సందెగాలికి సరసాలాడమని
విచ్చలవిడి నే ముచ్చట పడి
పెంచకు తడి దాటించకు దడి
మనవి మగని కబలి
ఆ...ఆ...ఆ...
ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
కుర్ర కుమారం కూకుంటె నేరం
కుర్ర కుమారం కూకుంటె నేరం
తొంగుంటె ఎట్టాగబ్బయ్యా యా యా