జాబిల్లి వచ్చాడే పిల్లా
అల్లుడే మేనల్లుడు (1970)
గజల్ శంకర్
ఆత్రేయ
ఘంటసాల
జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే..
ఎదురుచూస్తున్నాడే పిల్లా
ఎన్నెల్లు విరబూసే పున్నమీ నడిరేయి
వయసూ ఉరకలు వేసే సొగసైనా చినదానా
ఎంతో చక్కని వాడే చెంతకు రమ్మన్నాడే
జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే..
ఎదురుచూస్తున్నాడే పిల్లా
రేకురేకున నువ్వు సోకు సేసు కున్నావే
ముద్దు మొగమూ సూసి మురిసిపోతున్నావే...
కలహంస నడకలతో కదలిరావే పిల్లా
జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే..
ఎదురుచూస్తున్నాడే పిల్లా
సిగ్గె నీ చెంపలకు నిగ్గాయే లేవే
నవ్వె నీ కన్నులకు వెలుగాయె లేవే
వయ్యారి ఓ పిల్లా సయ్యాట లాడాలా
జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా !
నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే..
ఎదురుచూస్తున్నాడే పిల్లా