Showing posts with label అనురాగ్ కులకర్ణి. Show all posts
Showing posts with label అనురాగ్ కులకర్ణి. Show all posts

యాల యాల ఇయ్యాలా


యాల యాల ఇయ్యాలా
రూలర్ (2019)
గానం: అనురాగ్ కులకర్ణి, అనూష మణి 
రచన: రామజోగయ్య శాస్త్రి 
సంగీతం: చిరంతన్ భట్ 

పల్లవి:

యాల యాల ఇయ్యాలా 
డియ్యా డియ్యాలా  
ఎన్నియాల యాల జూసి 
ఎయ్యాలా... ఉయ్యాలెయ్యాలా 
 

గోల్డు రంగు పిల్ల


గోల్డు రంగు పిల్ల
శైలజారెడ్డి అల్లుడు (2019)
సంగీతం: గోపీ సుందర్
రచన: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, బెహరా,
మోహన భోగరాజు, హరిప్రియ

పోరి పోరి సత్యభామ
దుమ్ము దులిపి వెళ్ళెనంట 
విచ్చుకున్న మాట వచ్చి గుచ్చెనంటా...
కిట్టమూర్తికింక మొదలు
కొంటె తంటా....

గోల్డు రంగు పిల్ల...
గుండె దోచుకుంది ఇల్లా....
సౌండే చెయ్యకుండా
ఆడుగుపెట్టి వచ్చెనిలా...

కల్లోలమెంటేసుకొచ్చే పిల్లగాలే


కల్లోలమెంటేసుకొచ్చే
పడి పడి లేచె మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
రచన: కృష్ణకాంత్
గానం: అనురాగ్ కులకర్ణి

కల్లోలమెంటేసుకొచ్చే పిల్లగాలే
నను చూస్తూనే కమ్మేసెనే

కల్లోని గాంధర్వకన్యే ఎక్కి రైలే
విహరించేనా భూలోకమే

గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గొడుగే
అతిథిగ నువ్వొచ్చావనే

ఆశ పాశం బందీ సేసేలే

ఆశ పాశం బందీ సేసేలే
చిత్రం : కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : విశ్వ
గానం : అనురాగ్ కులకర్ణి

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

సేరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె
మాటుల్లోనా... సాగేనా...

ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో

నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి
రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే..
నీ ఉనికి ఉండాలిగా..

ఓ... ఆటు పోటు గుండె
మాటుల్లోన... సాగేనా...

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ ముడుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో

సిక్కు ముళ్ళు గప్పి
రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనం.
నీవు పెట్టుకున్న
నమ్మకాలు అన్ని
పక్కదారి బట్టి పోతుంటే
కంచికి నీ కధలే దూరం
నీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా

ఓ... ఆటు పోటు గుండె
మాటుల్లోన... ఉంటున్నా...

టైటిల్ సాంగ్ ఇస్మార్ట్ శంకర్

టైటిల్ సాంగ్
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
భాస్కరభట్ల రవికుమార్
అనురాగ్ కులకర్ణి

पता है मै कौन हूँ?
Shankar उस्ताद iSmart Shankar
గడబిడలకు बेफिकर
सड़क सड़क कड़क పొగర్
iStyle देखो नीचे ऊपर
ish ish iSmart'e
नाम भोले तो గల్లీ హడల్
Double दिमाग ఉంది इधर
करले अपने नीचे नजर
ish ish iSmart'e
ఏ' हैदराबाद शहर में पूछो बे साले
చార్మినార్ చాదర్ఘాట్ అంతా నాదే
హే' కిరి కిరి కిరి, కిరి కిరి కిరి,
కిరి కిరి కిరి జేస్తే मा की किरिकिरी
హహహా iSmart Shankar

యే' బీరేసుకుంటా బిందాసుగుంటా
భం భోలే శంభో శివ
నను పీకేటోడు దునియాల లేడు
యాడున్నా నాదే హవా
ఏదైనా గాని matter
चाय पत्ती पे settle
తెగలేదంటే अगर, सर पे पोड्ढू bottle (ఏయ్)
iSmileఏమో కిరాక్ brother
CutOutఏమో गरम figure
अक्कड़ बक्कड़ एक ही टक्कर
iSmart Shankar
దిగిండంటే खतम matter
మక్కలిరగదీసే meter
खटक मटक चटर-पटर
iSmart Shankar (ఓయ్)
హహహా iSmart Shankar
యే బొమ్మా!
నువ్ ఊఁ అంటే గోల్కొండ
రిపేర్ చేసి నీ చేతిల వెడ్త
నిన్ను బేగంని చేసి ఖిల్లా మీద కూర్సోవెడ్త
क्या बोलते? Aah?
चल बे साले నీలాంటోళ్ళని మస్తు చూసిన
दिलనే పతంగిలా ఎగరేస్కబోయే,
खद्दू का खीर लड़की
నా కంట్ల పడితే ఇడిసేదే లేదు,
పట్టేస్తా ఉరికీ ఉరికీ
बस है एक नजर
भजेगा दिल की buzzer
देदूंगा బంతి flower
घुंघुरू घुंघरू ఘల్ ఘల్
फिदा हुआ देख के शकल
లవ్ జేస్తా రాత్రి పగల్
కొనివెడ్తా కిలో నగల్
iSmart Shankar
నడుం జూస్తె centimetre
వెనకొస్తా kilometre
Gift ఇస్తా 7 Seater
iSmart Shankar
రేయ్ iSmart నువ్ తురుమ్ రా

ఉండిపో ఉండిపో

ఉండిపో ఉండిపో
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
భాస్కరభట్ల రవికుమార్
అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ..
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ..
ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ..
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనె నిండిపోయే నా జీవితం
వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం..

మనసే మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా
హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటిపిల్లాడిలా
నేనే  తప్పిపోయానుగా
నన్నే వెతుకుతూ ఉండగా
నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ..
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ..

సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే
వదిలేసి ఒకమాటు రావా
మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా
కాటుక్కళ్ళనే  తిప్పగా
నేనో రంగులరాట్నమై
చుట్టూ తిరుగుతున్నానుగా

తలనిమిరే చనువౌతా
నువ్ గాని పొలమారుతుంటే
ఆ మాటే  నిజమైతే..
ప్రతిసారి పొలమారిపోతా..
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా..
ప్రాణం నీదని నాదని
రెండూ వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గలగల
బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మన కథ

సూపర్ హిట్టు


సూపర్ హిట్టు
గద్దలకొండ గణేష్ (2019)
భాస్కరభట్ల
అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా
మిక్కీ జె మేయర్

జర్రా జర్రా అచ్చా
జర్రా జర్రా కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చ
చెయ్యి పడితే లక్ష
కాలు పెడితే రచ్చ
నకరాల్ జేస్తే బచ్చా
నే నారల్ తీసేటందుకే వచ్చా

సిగ్గుకి అగ్గెట్టేయ్
బుగ్గకి ముద్దెట్టేయ్
గలగలలాడే గలాసుతోటి
కులాసలెన్నో లెగ్గొట్టేయ్
చూపులు దిగ్గొట్టేయ్
లెక్కలు తెగ్గొట్టేయ్
గుడుగుడు గుంజం గలాటలోన
మంచి చెడ్డా మూలకి నెట్టేయ్
గిర గిర గిర గిర తిరిగే నడుమిది
కొర కొర చూపుకి కర కర మన్నదిరో

సూపర్ హిట్టు నీ హైటు
సూపర్ హిట్టు నీ రూటు
సూపర్ హిట్టు హెడ్డు వెయిటు
సూపర్ హిట్టు బొమ్మ హిట్టు
సూపర్ హిట్టు మీసం కట్టు
సూపర్ హిట్టు ఇభూది బొట్టు
సూపర్ హిట్టు ఈల కొట్టు
సూపర్ హిట్టు దంచి కొట్టు

జర్రా జర్రా అచ్చా
జర్రా జర్రా కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చ
చెయ్యి పడితే లక్ష
కాలు పెడితే రచ్చ
నకరాల్ జేస్తే బచ్చా
నే నారల్ తీసేటందుకే వచ్చా

కెలికితే ఏక్ బార్
బద్ధలే బాసింగాల్
దెబ్బకి సీను సితార్
ఎదుటోడి గుండెల్లో వణుకు
వణుకు అది నీ ఆస్తి
నీ దమ్మే నీకున్న బందోబస్తి
ఎహే నచ్చింది యాడున్నా
ఏక్ దమ్ ఏసేస్తా దస్తీ

సూపర్ హిట్టు నీ హైటు
సూపర్ హిట్టు నీ రూటు
సూపర్ హిట్టు హెడ్డు వెయిటు
సూపర్ హిట్టు బొమ్మ హిట్టు
సూపర్ హిట్టు మీసం కట్టు
సూపర్ హిట్టు ఇభూది బొట్టు
సూపర్ హిట్టు ఈల కొట్టు
సూపర్ హిట్టు దంచి కొట్టు
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చ
చెయ్యి పడితే లక్ష
కాలు పెడితే రచ్చ
నకరాల్ జేస్తే బచ్చా
నారల్ తీసేటందుకే వచ్చా