January 1, 2020

ఆమని ఋతువు వచ్చినదే


ఆమని ఋతువు వచ్చినదే
చిత్రం : జోధా అక్బర్ (2006)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : రాజశ్రీ
గానం : శ్రీనివాస్

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట

వేదనలే రగిలేనె క్రోధనలే మిగిలేనె
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామె
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే
చేరువనున్న చేరదురా ఆవేదన ఇక తీరదులె
చీకటి తెర ఏదో మానడుమా ఉన్నదే

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట

గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినదీ
నేనిచట బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది
కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట