ఉన్న మాట నీకు చెప్పుకుంట
రుక్మిణి (1997)
విద్యాసాగర్
బాలు, చిత్ర
ఉన్న మాట నీకు చెప్పుకుంట
ఉన్న మాట నీకు చెప్పుకుంట
నిన్ను వీడి నే ఉండలేనంట
చిన్న మాట విన్నవించుకుంట
నీ జంట లేని జన్మమెందుకంట
ఇద్దరం ఏకమై
ముద్దులే లోకమై
వెయ్యేళ్ళిలా ఉండాలని
ముత్తైదువై దీవించని
ప్రేమ..
ఈ వరద గోదారి వారధిగ మారి
చూపిందె చిన్నారి నా వలపు దారి
ఒట్టు వేసి చెబుతున్న నువ్వే నా వన్నె పూల వనమాలి
చూడగానె పోల్చుకున్నా నువ్వే నా గుండె కోరుకున్న మజిలి
అందుకే అందుకో అన్నదీ తీగమల్లి
నా వయసుకీనాడే తొలి వేకువంటా
నీ చెలిమి చిరువేడే ఎద తాకెనంటా
దాగి ఉన్న ప్రేమ కడలి ఇలా నిన్ను చూడగానే మేలుకుంది
కౌగిలింత లోన వాలే ముహూర్తం చేయి చాచి పిలిచింది
గంగలా పొంగుతూ సంగమించ రమ్మంది..