Showing posts with label భీమ్స్. Show all posts
Showing posts with label భీమ్స్. Show all posts

మీసాల పిల్ల

మన శంకరవరప్రసాద్ గారు (2026)
గాయకులు: ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
సాహిత్యం: భాస్కరభట్ల 

పల్లవి:

హే మీసాల పిల్లా.. 
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
మీసాల పిల్లా.. 
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
పొద్దున్ లేచిందగ్గర నుంచీ డైలీ యుద్ధాలా?
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా?

అట్లా కన్నెర్ర జెయ్యలా.. 
కారాలే నూరేలా
ఇట్టా దుమ్మెత్తిపొయ్యలా.. 
దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే.. 
చిరుతకి చెమటలు పట్టేలా

నీ వేషాలు చాల్లే.. 
నువ్ కాకాపడితే కరిగేటంత సీనేలేదులే
అందితె జుట్టూ.. అందకపోతే కాళ్ళబేరాలా
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముళ్ళు గుచ్చి 
పువ్వులు చేతికి ఇస్తారా..?

మీసాల పిల్లా.. 

నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి

నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
చిత్రం: మ్యాడ్ (2023)
రచన: శ్యామ్ కాసర్ల 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
గానం: భీమ్స్, కీర్తన, వరం 

పల్లవి:

హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్ర రోజాపువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె పడితె లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ వోతది
అది పోతే ఇంకోతొస్తది

హే నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ వోతది
అది పోతే ఇంకోతొస్తది

బొంబయ్ పోతావ


బొంబయ్ పోతావ
పేపర్ బాయ్ (2018)
రచన: సురేష్ ఉపాధ్యాయ
సంగీతం: భీమ్స్ సిసిరిలియొ
గానం: రఘురామ్, భీమ్స్

ఈ పాట రాసిన వారు.. గంగుల సూరి
డప్పు.. మోతుపురి చిరంజీవి
సంగీతం.. భీమ్స్ సిసిరిలియొ
చిత్రం.. పేపర్ బాయ్
మా పాట విన్న..
అరవై ఏళ్ళ ముసలి అయినా  
పదహారేళ్ళ పడుచుపిల్లలాగా..
ఆడాలా...
ఆడాలా...

వయ్యారి బ్లాక్ బెర్రీ

వయ్యారి బ్లాక్ బెర్రీ
చిత్రం : నువ్వా…నేనా..(2012)
సంగీతం : భీమ్స్
గానం : కైలాస్ ఖేర్

సర్రా సర్రా…సర్రా సర్ర…హే…
వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే
వారేవా హాలి బెర్రీ ఫోజులే

థోడా థోడా థోడా చేసింది నన్నే
టుక్ డా టుక్ డా టుక్ డా
ఆడ ఈడ యాడ
ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడ
సర్రా ఓ మేరా దిల్ లుట్ గయీ

ఓ…జాబిల్లి పైన నీటి జాడ తెల్సేలే
ఈపిల్ల మనసులోన మాట తెల్వదే
ఓ…జోలాలి పాటలోన
మాయ ఉందిలే
ఈ పిల్ల గాలిలోన మర్మముందిలే
లోటుపాటు చెప్పలే
పీకలోతు ముంచలే
అంతు పంతు లేదులే
దీని తంతు వేరులే
కక్కలేక మింగలేక
పీక్కోలేక ఏమి బాధలే
సర్రా ఓ మేరా దిల్ లుట్ గయీ

సర్రా సర్రా…సర్రా సర్రా….
ఓ…కన్నులో కన్నెప్రాణి కర్మాగారాలే
కవ్విస్తే కాలాపానీ కారాగారాలే
ఓ…నవ్వులో నేరం చేసే
నైజం ఉందిలే
పువ్వుల్తో ప్రాణం పోసే
నేర్పు ఉందిలే
కొంత ఆమ్లముందిలే
కొంత క్షారముందిలే
కొంత ప్లస్సు ఉందిలే
కొంత మైనస్సు ఉందిలే
సైన్సులోన మ్యాథ్స్ లోన
చెప్పలేని సత్యమిదిలే…
సర్రా ఓ మేరా దిల్ లుట్ గయీ

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే



చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భీమ్స్
గానం: ఉదిత్ నారాయణ్, ఉష

పల్లవి : 

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే
మనసాగదయ్యో 
ఏ మంత్రమేశావయ్యో

ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా
మనువాడుకుంటా 
మనసంత నీదేనమ్మో

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే