Showing posts with label శ్రీలేఖ. Show all posts
Showing posts with label శ్రీలేఖ. Show all posts

ప్రియసఖి ఓం సఖి....



ప్రియసఖి ఓం సఖి 
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
గానం: బాలు, శ్రీలేఖ 
రచన: వేటూరి 

పల్లవి:
 
ప్రియసఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి 
చెలి చెలి ప్రాణసఖి 

ప్రియసఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ 
తొలి తొలి ప్రేమసఖా
 
తొలిచూపుల్లో విరిసిన ప్రేమ 
మనసే దాని చిరునామా 

మనం ఇన్నాళ్ళు దాచిన ప్రేమ 
ఇక పంచేసుకుందామా...

సుప్రియా..... 

సన్నని నడుముకీ


సన్నని నడుముకీ
బంగారు బాబు (2009)
శ్రీలేఖ
చంద్రబోస్
బాలు, శ్రీలేఖ 

సన్నని నడుముకీ సన్నజాజులు
నల్లని కనులకీ తెల్లకలువలు
పగడపు పెదవికీ పొగడపూలు
ముసిముసినవ్వుకీ ముద్దబంతులూ
ముక్కుకి సంపెంగ

కళ్లకున్న కాటుక చూడు



కళ్లకున్న కాటుక చూడు
అదిరిందయ్యా చంద్రం (2005)
ఎం.ఎమ్. శ్రీలేఖ

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో 
నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో

చెవులకున్న దిద్దులు చూశా
ముక్కుకున్న ముక్కెర  చూశా
చూడమన్నవన్నీ చూశానే నా పువ్వులదండా
చూపకుండ ఎన్నో దాచావే

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా



ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఆదివిష్ణు (2008)
శ్రీలేఖ
జీన్స్ శ్రీనివాస్, చిత్ర
చంద్రబోస్

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా

తొలి చూపుతోనొ తొలి నవ్వుతోనొ
మొదలయ్యె ఆకర్షణే మొదటి రంగు
ఆ క్షణమునుండె అనుక్షణము ఉండె
రెండు గుండెల స్నేహమే 
రెండో రంగు రెండో రంగు

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా

మల్లి ..మల్లి.. మల్లి

మల్లి ..మల్లి.. మల్లి
ఆలుమగలు (1992)
సిరివెన్నెల
బాలు
శ్రీలేఖ

మల్లి ..మల్లి.. మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ ... మళ్ళీ..
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి
మల్లి మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన లేఖ ...మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా..
విరబూసినాక.... దరహాస రేఖ
విరితేనెవాకా .... ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మది గీతిక నీవేనే మల్లి మల్లి......

సుకుమారమయిన కుసుమారివయినా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకయిన వలరాజుకయినా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె ...మల్లి మల్లి.......