January 7, 2020

చుక్కలూరి చందమామ ...


చుక్కలూరి చందమామ
చిత్రం: జాబిలమ్మ పెళ్లి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓహొ హో హో చుక్కలూరి చందమామ
ఓహొ హో హో... సిగ్గులూరి సంధ్యభామ
ముద్ధిస్తావా... మురిపిస్తావా...
లాలిస్తాలే... పాలిస్తాలే
మాటిచ్చి మరువకుమా...
చరణం: 1

పువ్వై విరిసి నా జడలోనే కొలువుండిపో
నవ్వై మెరిసి నా మదిలోనే నువు నిండిపో
మనసిదిగో వయసిదిగో  సొగసిదిగో అందుకో
వలపిదిగో పిలుపిదిగో జత చిలకా చేరుకో
నిన్నే నమ్ముకుంటున్నా కమ్ముకుంటున్నా
అన్ని అందుకుంటున్న ముందుకొస్తున్న
ప్రియా ఇటున్నా ఇలారా  సరదా రెడీ దొర

ఓహొ హో హో సిగ్గులూరి సంధ్యభామ
ఓహొ హో హో

చరణం: 2

లోకం మరచి నా ఒడిలోనే నిలిచుండిపో
మైకం ముదిరి నా జతలోనే శృతి మించిపో
పెదవిదిగో మదువిదిగో మదనుడివై  ఏలుకో
పసి చిలక రస గుళికా సుఖ పెడతా చూసుకో
త్వరగా గుర్రమెక్కించెయ్ జోరుచూపించెయ్
ఇంకేం వెంటనే వచ్చేయ్. సంపదే ఇచ్చేయ్
అయితే ఇదంతా కలేనా
ఇది నీ దయా ప్రియా

ఓహొ హో హో చుక్కలూరి చందమామ
ఓహొ హో హో సిగ్గులూరి సంధ్యభామ
ముద్ధిస్తావా... మురిపిస్తావా...
లాలిస్తాలే... పాలిస్తాలే
మాటిచ్చి మరువకుమా...

ఓహొ హో హో...