హీ ఈజ్ సో క్యూట్
సరిలేరు నీకెవ్వరు (2020)
రచన: శ్రీమణి
గానం: మధుప్రియ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
అబ్బబ్బబ్బబ్బ... అబ్బాయెంత ముద్దుగున్నాడే...
ముద్దుగున్నాడే....ముద్దుగున్నాడే
ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే...
ఎత్తుగున్నాడే....ఎత్తుగున్నాడే
అల్లాఉద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా...
అల్లాడించాడె ఓరకంటా...పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ లాంటిదంటా
దొరకాలె గాని కొరికి తింటా.
చూపుల్లొ దాచినాడె ఏదో తూటా...
నన్నిట్టా కాల్చినాడె ఠా…ఠా…ఠా….ఠా
హీ ఈజ్ సో క్యూట్
హీ ఈజ్ సో స్వీట్
హీ ఈజ్ సో హ్యాండ్ సమ్
అబ్బబ్బబ్బబ్బ...
హీ ఈజ్ సో కూల్
హీ ఈజ్ సో హాట్
హీ ఈజ్ జస్ట్ ఆసమ్
చరణం 1:
కోడినిట్టా...తన్నుకెళ్ళే గెద్దల్లే...
చేపనిట్టా..ఎత్తుకెళ్ళే కొంగల్లే...
సొత్త్తునిట్టా...కొల్లగొట్టే దొంగల్లే...
దొంగిలించి వీణ్ణే దాచేయ్యాలిలే...
వీడి పక్కనుంటే చాలు...నన్నే చూసి
ఆడజాతి కళ్ళనిండా ఫుల్ జెలసీ...
మాటల్లో దాచినాడె ఆటంబాంబు మూట
నా కొంప కూల్చినాడె ఠా…ఠా…ఠా….ఠా
హీ ఈజ్ సో క్యూట్
హీ ఈజ్ సో స్వీట్
హీ ఈజ్ సో హ్యాండ్ సమ్
అబ్బబ్బబ్బబ్బ...
హీ ఈజ్ సో కూల్
హీ ఈజ్ సో హాట్
హీ ఈజ్ జస్ట్ ఆసమ్
వీరి వీరి గుమ్మడిపండు నీ మొగుడెవరే...?
బుగ్గలు రెండు జాంపండులాగ ఉన్న...వీడే...!
చరణం 2:
పొద్దునొస్తే...
ముద్దు కాఫీ ఇస్తాలే...
లంచికొస్తే...
హగ్ మీల్సే పెడతాలే...
రాతిరొస్తే... బెడ్డు మీద
(ఇదిగో అమ్మాయ్...)
అబో .. బ్రెడ్ జాం డిన్నర్ తినిపిస్తానులే
చీరలొద్దు... నగలు వద్దు..హమ్మా నాకు...
వీడి పిల్లలకు అమ్మనవ్వాలే...
మగవాడి అందం మీద లేదే ఒక్క పాట
వీడి ముందు అందం కూడా ఠా…ఠా…ఠా….ఠా
హీ ఈజ్ సో క్యూట్
హీ ఈజ్ సో స్వీట్
హీ ఈజ్ సో హ్యాండ్ సమ్
అబ్బబ్బబ్బబ్బ...
హీ ఈజ్ సో కూల్
హీ ఈజ్ సో హాట్
హీ ఈజ్ జస్ట్ ఆసమ్