నిన్నిలా నిన్నిలా చూశానే..
చిత్రం : తొలిప్రేమ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : అర్మాన్ మాలిక్, ఎస్.ఎస్.థమన్
నిన్నిలా నిన్నిలా చూశానే..
కళ్ళల్లో కళ్ళల్లో దాచానే..
రెప్పలే వేయనంతగా కనులపండగే..
నిన్నిలా నిన్నిలా చూశానే..
అడుగులే తడబడే నీ వల్లే..
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే..
నిను చేరిపోయే నా ప్రాణం..
కోరెనేమో నిన్నే ఈ హృదయం..
నా ముందుందే అందం.. నాలో ఆనందం..
నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం..
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా
తొలి తొలి ప్రేమే దాచేయకలా..
చిరు చిరు నవ్వే ఆపేయకిలా..
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వుమ
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా..
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా