January 1, 2020

అలకలకు లాలీజో



అలకలకు లాలీజో
చిత్రం : అల్లరిపిల్ల (1992)
సంగీతం : విద్యాసాగర్
గానం : మనో, లలిత

అలకలకు లాలీజో
కులుకులకు లాలీజో..
అలకలకు లాలీజో
కులుకులకు లాలీజో..
కలికి చిలక.. కలత పడక..
కలికి చిలక కలత పడక
కలల ఒడి చేరాకా
ఆహా..
ఝంచకు.. ఆహా..
ఝంచకు..
కులుకులకు లాలీజో..
తళుకులకు లాలీజో..జత కలిసినదొక తార
జతులను పలుకు సితార
మతి చెడు సొగసులు ఔరా..
వెతికిన దొరకవు లేరా..
స్వరాలలో కోయిలమ్మ సరాగమే ఆడగా
పదే పదే కూనలమ్మ పదాలుగా పాడగా
అండకోరి వచ్చెనమ్మ కొండపల్లి బొమ్మ
గుండెలోన విచ్చెనమ్మ కొండమల్లి రెమ్మ
పండులాగ దిండులాగ చెండులాగ ఉండిపోగ
పండుగాయె పండు వెన్నెల..

ఆహా..
ఝంచకు..
ఆహా..
ఝంచకు..
కులుకులకు లాలీజో..
తళుకులకు లాలీజో..
ఝంచకు చకు ఝంచకు..
ఝంచకు చకు ఝంచకు..

ఉరుకుల పరుగుల జాణ
దొరికిన సిరుల ఖజానా
తొలకరి అలకలలోనా
చిలికెను వలపులు మైనా
మరీ ఇలా మారమైతే ఫలించునా కోరిక
కథేమిటో తేలకుంటే లభించునా తారకా
అందమంత విందు చేసె కుందనాల కొమ్మ
ముందుకాళ్ళ బంధమేసే చందనాల చెమ్మ
అందరాని చందమా అందుకూన్న పొందులోన
నందనాలు చిందులెయ్యగా..

ఆహా.. ఝంచకు..
ఆహా.. ఝంచకు..
కులుకులకు లాలీజో..
తళుకులకు లాలీజో..
కులుకులకు లాలీజో..
తళుకులకు లాలీజో..
కలికి చిలక.. కలత పడక..
కలికి చిలక కలత పడక
కలల ఒడి చేరాకా
ఆహా.. ఝంచకు..
ఆహా.. ఝంచకు..
ఆహా.. ఝంచకు..
ఆహా.. ఝంచకు..