Showing posts with label వేదవ్యాస. Show all posts
Showing posts with label వేదవ్యాస. Show all posts

ఓంకారం సకలకళా శ్రీకారం

ఓంకారం సకలకళా శ్రీకారం
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : వేదవ్యాస
గానం : శంకర మహదేవన్

ఓంకారం సకలకళా శ్రీకారం
చతుర్వేద సాకారం
చైతన్య సుధాపూరం
జ్ఞాన కమల కాసారం

ధ్యాన పరిమళాసారం
మధురభక్తి సింధూరం
మహాభక్త మందారం
భవ భేరీ భాండారం

హృదయ శంఖ హుంకారం
ధర్మ ధనుష్టంకారం
జగత్ విజయ ఝంకారం
అద్వైత ప్రాకారం 
భజేహం

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: వేదవ్యాస
గానం: కార్తీక్ 

పల్లవి:

ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ. 

ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ...

ఛాంగుభళా చమకు చమకు 
తళుకు బెళుకు సృష్టికళా
హృదయమిలా ఊగే హొయలు చిలుకు 
లయల కులుకు సోయగాల ఊయల 

శ్రీ కృష్ణః

శ్రీ కృష్ణః
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: శ్రీ వేదవ్యాస్
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మణి నాగరాజ్ 
 
కృష్ణా...ఆ
కృష్ణా...
శ్రీకృష్ణః శరణం మమ 
శ్రీకృష్ణః తరణం మమ

శ్రీకృష్ణః శరణం మమ 
శ్రీకృష్ణః తరణం మమ

శ్రీకృష్ణః 
కృష్ణః

అఖిల చరాచర

అఖిల చరాచర
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
గానం: ఉన్ని కృష్ణన్ 
రచన: శ్రీ వేదవ్యాస్

కృష్ణా.... ద్వారకావాసా 
అఖిల చరాచర జగద్జాలముల అనాది అత్మల సాక్షిగా 
అంతట నీవే ఉండీ లేవను ఉజ్వల భావం ఊపిరిగా 
నింగీ నేలా నీరూ నిప్పూ గాలి కలయికల కాపరిగా 
నీ ఆటే ఆటగ పాటే పాటగ సృష్టి  స్థితి లయ,
విన్యాసలయల, ఆవల ఈవల అలరారే నీ లలితా
నృతరస లహరుల లీల, లీలాకృష్ణ చూపరా.     
అమ్మకు చూపరా....

సరిగమ పమ రిస సరిమ, 
మప నిద నిని స, 
నిసరిప మపగమ రిస నిస రిస నిస రిస నిస నిప 
మప గమ రిస నిని స

శంకర విజయం

శంకర విజయం 
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : శ్రీ వేదవ్యాస్

శంకర విజయం 
ఆదిశంకర విజయం
సత్య శంకర విజయం 
ధర్మ శంకర విజయం 

ఆస్తిక హిత భూషణం 
అసమ్మత మత భీషణం 
ఆసేతు సీతాచల సంచలనం 
శంకర విజయం 
శంకర విజయం 

దాశరథీ కరుణా పయోనిధి

దాశరథీ కరుణా పయోనిధి
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
బాలు, చిత్ర
వేదవ్యాస

దాశరథీ కరుణా పయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామకోటి రచియించడమా
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిధి

గుహుడు నీకు చుట్టమా  గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తొబుట్టువా  ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా  నీ దర్శనమే  ఇమ్మంటిని కానీ
ఏల రావు నన్నేలరావు నన్నేల ఏల రావు
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిధి

రామ రసరమ్య ధామ, రమణీయ నామ
రఘువంశ  సోమ ,రణరంగ భీమ
రాక్షస విరామ
కమనీయ ధామ  సౌందర్య సీమ
నీరజశ్యామ నిజబుజోద్దామ
భూజనులరామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ

తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మవిచక్షణ
గోదారి కలిసెనేమిరా డాండ డ డాండ డాండ నినదమ్ముల
జాండము నిండ మత్తవేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగమ
సింగశుభంగ రంగ బహురంగద
భంగ తుంగ సుగుణైకతరంగ
శుసంగ సత్య సారంగ సుసృతివిహంగ
పాప మృదుసంగ విభంగా
భూతల పతంగ మధుమంగళరూపము చూపవేమిరా
గరుడగమన రా రా గరుడగమన రా రా