మనసైన నా ప్రియా...
చిత్రం : ఆహా (1998)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : హరిహరన్
మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...
మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...
మనసైన నా ప్రియా...
ఉదయించిందమ్మా...
హృదయంలో ప్రేమ...
ఎదురయ్యిందమ్మా...
సుధలున్న సీమ...
నీ నవ్వుల్లో తొలిపొద్దే చూసుంటా...
కాకుంటే లోకం రోజులా లేదే...
నా చుట్టూ నిన్నా ఇంతందం లేదే...
ప్రతివారి పెదవులపైన పకపక వీణ ఇదివరకెపుడూ విన్నట్టే లేదే...
మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...
మనసైన నా ప్రియా...
పొరపాటున నువ్వు పరిచయం అవకుంటే...
బ్రతుకంటే అర్థం తెలిసేదే కాదే...
నడిరేయల్లే రాయల్లే నిలిచేదో...
అనుకుందామన్న ఎదోలా వుందే...
రేపంటూ సున్నా నీతో నడవందే...
మనమింకా పుట్టకముందే ఇద్దరి ప్రాణం
ఒక్కటి చేసినా ముడిపడివుంటుందే...
మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...
మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...
మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...