January 5, 2020
రాగాలనే బోయీలతో...
కోనలో... సన్నజాజిమల్లి జాజిమల్లి
చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, జానకి
కోనలో...
సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో...
పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో...
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో...
అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హోయ్
శ్రీకారమై హోయ్
కస్తూరితాంబూలమీవే...కోరుకో...
సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో....
కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో...
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో....
పాలబుగ్గపైన రంగవల్లి
చరణం 1:
మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగరంజితాలు
సరసములో.... సమరములూ
సరసులకూ... సహజములూ
ప్రాభవాలలోన నవశోభనాల జాణ
రాగదే.. రాగమై..రాధవై
కోరుకో...
సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో...
కన్నె సొకులన్ని సొకులన్ని
పాడుకో...
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో...
పాలబుగ్గపైన రంగవల్లి
రాగాలనే హోయ్
బోయీలతో హోయ్
మేఘాల మేనాలో రానా...
కోనలో...
సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో...
పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో...
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో...
అనురాగవల్లి రాగవల్లి
చరణం 2:
కోయిలమ్మ రాగం... కొండవాగు వేగం
పారిజాత సారం ...ఏకమైన రూపం
అధరముపై... అరుణిమలు
మధురిమకై...మధనములు
నందనాలలోన
రసమందిరాలలోన
హాయిగా... సాగగా... చేరగా
కోనలో....
సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో...
పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో...
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో...
అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హోయ్
శ్రీకారమై హోయ్
కస్తూరితాంబూలమీవే...
కోరుకో...
సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో....
కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో...
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో....
పాలబుగ్గపైన రంగవల్లి