పయనించే చిరుగాలీ...నా చెలి సన్నిధికే చేరీ..
చిత్రం: పట్నం పిల్ల (1980)
సంగీతం: చక్రవర్తి
పాడినవారు: జి. ఆనంద్, పి.సుశీల (కోరస్).
సాహిత్యం : వేటూరి
పల్లవి:
ఆ..హా...హా...హా....ఆ..హా...హా...హా....
పయనించే చిరుగాలీ
నా చెలి సన్నిధికే చేరీ..
నా పిలుపే వినిపించాలి...నా ప్రేమే తెలపాలీ..
వలపుల పూలవాన జల్లే...కురియాలీ..పయనించే చిరుగాలీ
నా చెలి సన్నిధికే చేరీ..
నా పిలుపే వినిపించాలి...నా ప్రేమే తెలపాలీ..
వలపుల పూలవాన జల్లే...కురియాలీ..
చరణం 1:
ఆ..హా.హా..హా... ఓ..హో..హో...హో... ఊ..హూ..హూ...హూ..
అందమంతా ఆరబోసి ఆ చిన్నది...
అందకుండా.. కందకుండా పోతున్నది
అందమంతా ఆరబోసి ఆ చిన్నది..
అందకుండా.. కందకుండా పోతున్నది
మనస్సున మొహం రేపి మాటాడకున్నది
జవరాలి అందం.. వేసేను బంధం..
జవరాలి అందం.. వేసేను బంధం..
క్షణమైనా ఆగలేనని చెలితో తెల్పవా..
పయనించే చిరుగాలీ
నా చెలి సన్నిధికే చేరీ..
నా పిలుపే వినిపించాలి...నా ప్రేమే తెలపాలీ..
వలపుల పూలవాన జల్లే...కురియాలీ..
చరణం 2 :
ఆ..హా.హా..హా... ఓ..హో..హో...హో... ఊ..హూ..హూ...హూ..
గుండెలోన ప్రణయదేవి కొలువైనది....
నిండు వలపు స్వీకరించే తరుణం ఇది
గుండెలోన ప్రణయదేవి కొలువైనది....
నిండు వలపు స్వీకరించే తరుణం ఇది
ఏకాంత సమయంలోన ఈ మౌనమేలా?
నాలోన రేగే మోహాల జ్వాలా...
నాలోన రేగే మోహాల జ్వాలా...
మనసారా ఏలుకొమ్మని చెలితో తెల్పవా
పయనించే చిరుగాలీ
నా చెలి సన్నిధికే చేరీ..
నా పిలుపే వినిపించాలి...నా ప్రేమే తెలపాలీ..
వలపుల పూలవాన జల్లే...కురియాలీ..
ఆ..హా.హా..హా... ఊ..హూ..హూ...హూ..