January 1, 2020

సరిగమ పదనీ స్వరముల

సరిగమ పదనీ స్వరముల
రుక్మిణి (1997)
విద్యాసాగర్
బాలు, చిత్ర
సిరివెన్నెల

సరిగమ పదనీ స్వరముల సుధనీ చిలుకుతు పదనీ ఎదనీ
జరిగినదిదనీ పరిణయ కథనీ చిలిపిగ విననీ సొదనీ
కననీ విననీ జంటనీ అననీ జనవాణీ
రవినీ శశినీ చూడనీ ఒడినే రసరాజధాని
సరిగమ పదనీ స్వరముల సుధనీ చిలుకుతు పదనీ ఎదనీ
జరిగినదిదనీ పరిణయ కథనీ చిలిపిగ విననీ సొదనీ

పారాణి పాదాలనీ నాలోన పారాడనీ
ఈ రాణి నాదేననీ కాలాన్ని పాలించనీ
నినుగనీ నీవనీ అవనీ ఆమనీ
మమతల తావినీ మరి మరి పంచనీ
కయ్యాలనీ నెయ్యాలనీ కల్లోన కళ్యాణి ఒళ్ళోన దిగెనని

సరిగమ పదనీ స్వరముల సుధనీ చిలుకుతు పదనీ ఎదనీ
జరిగినదిదనీ పరిణయ కథనీ చిలిపిగ విననీ సొదనీ

సూర్యుణ్ణి  రానీకనీ రాతిరిని శాసించనీ
రాగాన్ని రారమ్మనీ రసలీల సాగించనీ
కరగని కాంక్షనీ కలలే కాంచనీ
కరిగిన ఆంక్షనీ కళలే పెంచనీ
అందాలన్నీ అందాలనీ అల్లాడు పిల్లాడి అల్లర్లు కనుగొని

సరిగమ పదనీ స్వరముల సుధనీ చిలుకుతు పదనీ ఎదనీ
జరిగినదిదనీ పరిణయ కథనీ చిలిపిగ విననీ సొదనీ
కననీ విననీ జంటనీ అననీ జనవాణీ
రవినీ శశినీ చూడనీ ఒడినే రసరాజధాని