January 1, 2020

కదిలే కాలమే జీవితం


కదిలే కాలమే జీవితం
జోడి (1999)
రెహమాన్
భువనచంద్ర
జానకి, బాలు

కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
రాశా నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా

చందురుడు, సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎపుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్
కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
వ్రాసే  నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా

చందురుడు, సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎపుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్

కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
రాసే  నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా

చరణం 1:

కవితలనే మాటలుగా
కన్నులతో రాశాను
మాటల్లో నింపుకున్నవి
నా ప్రాణాలయ్య

మగువా నీ లేఖలని
పువ్వులతో తెరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖకి
గాయం అయిపోదా

ప్రియుడా నీ ఊహల్తో
కరిగే పోతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై
నిన్నే నేను ప్రేమిస్తున్నా

కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
వ్రాసే  నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా

చరణం 2:

చెలియా నీ అందియనై
పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు
సుగంధమై రానా

నా కాలి అందియవో
నాలోని ఊపిరివో
ప్రియుడా నువ్ సుగంధమైతే
వసంతమై పోనా

జివ్వు మన్న ప్రాయము
గమ్మునుంటుందా
ప్రాణాలే నీకర్పిస్తా
పెదవులు తేనె పంచి ఇయ్యవా

కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
ఓ .. రాశా  నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా

చందురుడు, సూరీడు వార్తాహరులంటా
రేపవలు ఎపుడైనా
లేఖలు నిన్నే చేరునోయ్

కదిలే కాలమే జీవితం
మేఘం తెల్ల కాగితం
ఓ .. వ్రాసా  నీకే ముందుగా
మదిలో మాట తియ్యగా