Showing posts with label సుసర్ల దక్షిణామూర్తి. Show all posts
Showing posts with label సుసర్ల దక్షిణామూర్తి. Show all posts

దీపావళి దివ్య దీపావళి

జిల్లెళ్ళమూడి అమ్మ (1975)
రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి
గానం: సుశీల 

పల్లవి :  

దీపావళి దివ్య దీపావళీ
దీపావళి దివ్య దీపావళి
ఇది మాపాలి ఆనంద భావావళీ 
దీపావళి దివ్య దీపావళి

కులాసా రాదోయ్ రమ్మంటే


కులాసా రాదోయ్ రమ్మంటే
చిత్రం: అన్నపూర్ణ (1960)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
రచన: ఆరుద్ర
గానం: జిక్కి(కృష్ణవేణి)

పల్లవి: 

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్

కల నిజమాయెగా

కల నిజమాయెగా
సంసారం (1950)
సుసర్ల దక్షిణామూర్తి
జిక్కి
సముద్రాల సీనియర్

కల నిజమాయెగా
కోరిక తీరెగా
సాటిలేని రీతిగా
మదినెంతో హాయిగా

ఓ...
కోయిల పాటే
మాటై తోచే
చిత్రము గాదా ప్రేమా
చిత్రము గాదా ప్రేమా

హృదయమునేదో కదుల్చు గాదా
తియ్యని బాధా ప్రేమా
హృదయమునేదో కదుల్చు గాదా
తియ్యని బాధా ప్రేమా

ఓ...
ఏమో తెలియని భావమదేమో
ఇంపుగ మెరసే నాలో
ఏమో తెలియని భావమదేమో
ఇంపుగ మెరసే నాలో

నిజమిది దాని విశేషమేదో
నా మది మైమరపించే
నిజమిది దాని విశేషమేదో
నా మది మైమరపించే

ఓ...
ప్రేమాలయమే  హృదయమె కాదా
సుందరనందన సీమా
ప్రేమాలయమే  హృదయమె కాదా
సుందరనందన సీమా

నేడో రేపో సుఖింతునుగా
ప్రేమ ఫలించును గాదా
నేడో రేపో సుఖింతునుగా
ప్రేమ ఫలించును గాదా

కల నిజమాయెగా
కోరిక తీరెగా
సాటిలేని రీతిగా
మదినెంతో హాయిగా 

హరిశ్చంద్రుడు

నిత్యం శవాలతోనే సహజీవనం చేస్తూ,
వైరాగ్యం పరాకాష్థకు చేరిన వేళ,
జీవిత సత్యాన్ని తెలుసుకొన్న
హరిశ్చంద్రుడు :

రచన : బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల

|| శా ర్దూ ల ము ||

మాయా మేయ జగంబె, నిత్య మని సం - భావించి ,
మోహంబు నన్ నా యిల్లా లని , నా కుమారు డని ,
ప్రా - ణంబుండు నందాక ,ఎంతో ,యల్లాడిన ,
ఈ శరీర మిపుడిం- దున్ ,కట్టె లన్ , గాలు చో
ఆ యిల్లాలును రాదు ! పుత్రుడును తో - డై  రాడు !!
తప్పింప గన్ !!!
మాయా మేయ జగంబె....

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,
శ్మశానంలో , హరిశ్చంద్రుడు :

రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల

|| సీసము ||

కాబోలు, బ్రహ్మ రా - క్షస సమూహం బిది
ఘోషించు చుండె , ఋ - క్కుల , క్రమంబు

కాబోలు, వీరు వి - గత జీవ భాంధవులు
అడరు చుండిరి , మహా - ర్తా రవముల

కాబోలు , వీరు ట - క్కరి భూత మాంత్రికుల్
నెమకు చుండిరి , కపా - లముల కొఱకు

కాబోలు నిది, పిశా - చీ బాంధవ శ్రేణి
వలలంపు భూవంపు - బంతి సాగే

|| తేటగీతి ||

చిట్లు చున్నవి కాబోలు - చితుల లోన
కాల్ప బడెడు శవాల, కం - కాళ సమితి!
ఇట, పెఠీ పెఠీలను రవములే - యెసగు చుండు
దిక్కు లన్నింట మార్మోత - పిక్కటిల్ల!

ఆహా ! ఎంత విచిత్రంగా ఉందీ శ్మశానం.
భగవాన్ , ఒకనాడు సకల భూ మండలాన్నీ
నా చే పాలింప జేసి , ఈనాడొక కాటి కాపరిగా
మార్చడం కేవలం నీ కృపే.
రారాజు నుంచి భిక్షకుని వరకూ
మహా విఙ్ఞాని నుంచి అఙ్ఞాని వరకూ
సకల ప్రాణి కోటికీ
ఈ శ్మశానమే అంతిమ రంగం చేసి
నీ సర్వ మానవ సమానత్వం
నిరూపించావు.
ఆహా ఏమి నీ లీల !!!!!
       
             **

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,
శ్మశానంలో , హరిశ్చంద్రుడు :

రచన : జా షు వా
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల

|| సీసము ||

ఇచ్చోట-ఏ-సత్క - వీంద్రుని,కమ్మని
కలము,నిప్పుల లోన - కరగి పో యె !

ఇచ్చోట-ఏ-భూము - లేలు,రాజన్యుల
అధికార ముద్రిక - లంతరించె !

ఇచ్చోట -ఏ-లేత - ఇల్లాలి,నల్ల పూ
సల సౌరు,గంగలో - కలసి పోయె !

ఇచ్చోట, ఎట్టి , పే - రెన్నికన్,గనుగొన్న
చిత్ర లేఖకుని,కుం - చియ,నశించె !

|| తేటగీతి ||

ఇది, పిశాచులతో, నిఠ - లేక్ష ణుండు
గజ్జె కదలించి ఆడు, రం - గ స్థలంబు!
ఇది, మరణ దూత, తీక్ష్ణమౌ - దృష్టు లొలయ
అవని పాలించు , భస్మ సిం - హాసనంబు !!
ఆ...