January 5, 2020

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో


ఏమో ఏమో ఏ గుండెల్లో
ఎంత మంచి వాడవురా (2020)
గానం: ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: గోపీ సుందర్‌
రచన: రామజోగయ్య శాస్త్రి

పల్లవి:

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనోబలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం
చరణం 1:

ఏ నీటిముల్లు కన్నంటకుండా
ఏ జీవితం కొనసాగదుగా
గాయాల మంట చవిచూడకుండా
ఏ జన్మమూ కడతేరదుగా
ఈ దేహమున్నదే ఇతరుల కొరకు
ఇదే పరమార్థం
పరోపకారమే మనమనుగడకు
కారణమనుకుందాం

చరణం 2:

ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాళీగా ఉండని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆ లోటు తీర్చగా
ఇపుడూ ఎప్పుడూ మనం ముందుంటాం
కష్టాల బరువును తేలిక పరిచే
భుజం మనమౌదాం

చరణం 3:

ఏ రక్తబంధం లేకున్నా గానీ
స్పందించగలిగిన స్నేహితులు
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా
అందించగలిగిన వారధులం
ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం
కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి పాడడం
ఆహా ఎంత వరం