January 19, 2020

తొలి వలపే తియ్యనిదీ (విషాదం)


తొలి వలపే తియ్యనిదీ (విషాదం)
చిత్రం: నీడలేని ఆడది (1974)
సంగీతం: సత్యం
రచన: సినారె
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఆ...ఆ..హా
ఆ...ఆ..
తొలి వలపే
తియ్యనిదీ
మదిలో మిగిలిన గాయమది
కలలాగా చెరిగినది
కథలాగా ముగిసినదితొలి వలపే
తియ్యనిదీ
మదిలో మిగిలిన గాయమది

చరణం 1:

అవే కెరటాలు
అవే కిరణాలు
అదే గాలి ఈల
అదే సందె వేళ
అన్నీ ఉన్నాయి
అలాగే ఉన్నాయి
కానీ
చెలి ఒకటే కరువైనది
జీవితమే శిలయైనదీ
తొలి వలపే
తియ్యనిదీ
మదిలో మిగిలిన గాయమది
రాధా.....

చరణం 2:

ఆనాటి ఆ బాసలేమాయెనో
ఆ కలలు ఆ చెలిమి ఏమాయెనో
కొడిగట్టిన ఈ దీపం ఆరకముందే
కొనఊపిరి ఈ గూటిని వీడకముందే
ఓ చెలీ....