January 1, 2020

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా


ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
బంగారు బుల్లోడు (1993)
రాజ్-కోటి
వేటూరి
బాలు, చిత్ర

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట
ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఏడురంగుల ఈ వానవిల్లు
చెయ్యి తాకిడికే చెమ్మగిల్లు
చుక్కలేలకు నూ సూదికళ్లు
చూపుకే నడుమే సన్నగిల్లు
పాలలో మీగడెందుకో పైటలో పొంగులందుకే
చల్లలో వెన్నలెందుకో జంటలో వేడి అందుకే
జాజివనం చేరుకుని జానపదం పాడుకుని
ఆడుకునే వయ్యారమే వసంతపు దుకాణమే అంట
ఆఆ

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

పాపలందరిలో బంతిపువ్వు
చెంగుకోరని చామంతిపువ్వు
దండయాత్రకు దక్కాలి నువ్వు
కౌగిలింతల కట్నాలు ఇవ్వు
ఇంటిలో గుట్టు పెళ్ళికి దండగే పూలపల్లకి
సోకుతో శోభనాలకి దీపమే అడ్డు రాత్రికి
కోడెతనం కొంగుకసి ఆడతనం పొంగురుచి
కోరుకునే వయస్సులో ఎడాపెడా కవ్వించులే పంట


ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మెుగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట
హే