వసంతాల ఈ గాలిలో
ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ (2003)
వేటూరి
ఆనంద్-మిలింద్
అభిజిత్
వసంతాల ఈ గాలిలో....
గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్యలో...
పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలు...?
తుషారాల నీరెండలు
కుహూ మన్న ఈ గొంతులో...
ధ్వనించాయిలే ప్రేమలు.
వసంతాల ఈ గాలిలో....
గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్యలో
పరాగాల కవ్వింపులుచరణం 1:
మేఘాల సందేశమూ...
ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతమూ...
ఎదలోని హరివిల్లులే
మైనాల సంగీతమూ
ఈ పూలగంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ
నీ వేడి నిట్టూర్పులే
అది శోకమో ఒక శ్లోకమో
ఈ లోకమే ప్రేమనీ...
వసంతాల ఈ గాలిలో
గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్యలో
పరాగాల కవ్వింపులు
చరణం 2:
ప్రేమించిన కళ్ళకు
నిదరన్నదే రాదులే
ప్రేమించినా వాళ్లకు
ఏ ఆకలీ లేదులే
ఊహల్లో విహరింపులు
ఉయ్యాల పవళింపులు
వెన్నెల్ల వేధింపులు
వెచ్చంగ లాలింపులు
అది యోగమో... అనురాగమో
పురివిప్పు ఈ ప్రేమలో
వసంతాల ఈ గాలిలో
గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్యలో
పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో
తుషారాల నీరెండలో
కుహూ మన్న ఈ గొంతులో
ధ్వనించాలి ఈ ప్రేమలు.