January 5, 2020

ప్రేమా ప్రేమా తొలి వయసుకి

ప్రేమా ప్రేమా తొలి వయసుకి
శ్రీ (2005)
సంగీతం: సందీప్ చౌతా
రచన: భాస్కరభట్ల
గానం: శ్రేయా ఘోషాల్, రాజేష్ కృష్ణన్

ప్రేమా ప్రేమా తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమా ప్రేమా మది అడుగున అలజడి నువ్వా నువ్వా
అవును అంతేగా....
ప్రేమ అంటే వింతేగా..
నిన్ను చేరిందా... అది ఉరుకులు పరుగులు తీసి తీసి
ఆ....ప్రేమా ప్రేమా తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమా ప్రేమా మది అడుగున అలజడి నువ్వా నువ్వా
అవును అంతేగా...
ప్రేమ అంటే వింతేగా...
నిన్ను చేరిందా... అది ఉరుకులు పరుగులు తీసి తీసి

చరణం 1:

కుదురులేదు నిదురే రాదు నిన్ను చూడందే
కుదురులేదు నిదురే రాదు నిన్ను చూడందే
కంటిపాపకు అలుపే రాదు నిన్ను చూస్తుంటే
లోకమంతా ఈ మైకాన్నే ప్రేమ అంటుందీ...
ఇద్దరం ఇక ఒకటైపోతే ఎంతో బాగుంటుందీ 

ప్రేమా ప్రేమా తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమా ప్రేమా మది అడుగున అలజడి నువ్వా నువ్వా

చరణం 2:

గుండెనేమొ దోచేసావు ఎంతో వేగంగా
గుండెనేమొ దోచేసావు ఎంతో వేగంగా
నువ్వు నాలో అయిపోయావు అంత గాఢంగా
ప్రేమలోని మహిమే అంత తెలుసుకో నీవు
వలపు తలుపే తెరిచిందంటే ఒకరికి ఒకరం తోడు

ప్రేమా ప్రేమా తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా
ప్రేమా ప్రేమా మది అడుగున అలజడి నువ్వా నువ్వా
అవును అంతేగా..
ప్రేమ అంటే వింతేగా...
నిన్ను చేరిందా.. అది ఉరుకులు పరుగులు తీసి తీసి