Showing posts with label మంగళంపల్లి. Show all posts
Showing posts with label మంగళంపల్లి. Show all posts

కరుణాలోలా నారాయణా

కరుణాలోలా నారాయణా 
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: గబ్బిట వెంకటరావు
గానం:: బాలమురళీకృష్ణ

పల్లవి::

నారాయణ
కరుణాలోలా నారాయణా
శ్రితజనపాలా...దీనావనా

కరుణాలోలా నారాయణా
శ్రితజనపాలా...దీనావనా

కరుణాలోలా నారాయణా

మేలుకో శ్రీరామ

మేలుకో శ్రీరామ
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన::దాశరథి
గానం:: బాలమురళీకృష్ణ, లీల 

పల్లవి::

మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ

మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ

మేలుకొని వేగ..మమ్మేలుకోవయ్యా

మేలుకొని వేగ..మమ్మేలుకోవయ్య

మేలుకో..మేలుకో...

మేలుకో..ఓఓఓఓఓ

భజనా చేయవె మనసా


భజనా చేయవె 
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్
 
పల్లవి:

భజనా చేయవె మనసా 
నిరతము 
భజనా చేయవె మనసా 
నిరతము

కరుణాసాగరా


కరుణాసాగరా 
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

కరుణాసాగరా... 
కరుణాసాగరా...
శ్రీ రాఘవేంద్ర

మంత్రాలయ మందిరము


మంత్రాలయ మందిరము 
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్
 
పల్లవి:

మంత్రాలయ మందిరము 
సుందరము భువిలో  
శాంతిధామా మదిగొ 
సౌఖ్యనిలయమ్మదిగొ 
 

మంత్రాలయమే


మంత్రాలయమే     
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

మంత్రాలయమే
మాకు దిక్కురా 

రాఘవేంద్రుడే సంరక్షకుడు 

మంత్రాలయమున


మంత్రాలయమున    
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

మంత్రాలయమున
రాజిలు రాజా 

శాంతిసుఖమ్ముల 
ఒసగెడి రాజా 
శ్రీ గురురాజా 

రాఘవేంద్ర గురుసార్వభౌమ


రాఘవేంద్ర గురుసార్వభౌమ    
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

రాఘవేంద్ర గురుసార్వభౌమ
రాఘవేంద్ర గురుసార్వభౌమ

తారకనామ 
సన్మంత్రధామ

రాఘవేంద్రుడు రాజరాజు


రాఘవేంద్రుడు   
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

రాఘవేంద్రుడు...
రాఘవేంద్రుడు 
రాజరాజు 
సురమణిధేనువు 
కల్పకమతడే....

వందనము శ్రీ రాఘవేంద్ర


వందనము శ్రీ రాఘవేంద్ర
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

వందనము శ్రీ రాఘవేంద్ర 
వందనము శ్రీ రాఘవేంద్ర
వందనము శ్రీ రాఘవేంద్ర
చంద్రా....
వందనము శ్రీ రాఘవేంద్ర

నిన్ను నమ్మితినయ్యా


నిన్ను నమ్మితినయ్యా 
మంత్రాలయ మందిరం (1985) 
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
కన్నతండ్రివీ నీవే 
గురువూ దైవము నీవే 
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర

బేట్రాయి సామి దేవుడా


బేట్రాయి సామి దేవుడా
రాయలసీమ జానపదం 
సంగీతం: రాజ్-కోటి 
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ 
 
బేట్రాయి సామి దేవుడా-
నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా

శీతాద్రి శిఖరాన



శీతాద్రి శిఖరాన
శ్రీ లలితా హారతి
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
రచన: బేతవోలు రామబ్రహ్మం
సంగీతం: టి. నాగరాజ్

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు |
మా తల్లి నత్తుకకు నీరాజనం _
కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి |
బాగైన అందెలకు నీరాజనం _
బంగారు నీరాజనం
భక్తి పొంగారు నీరాజనం

వస్తావట్టిది పోతావట్టిది


మంగళంపల్లి బాలమురళి గారు పాడిన తత్వాలు
-----వైరాగ్య తత్త్వం

వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
చేసిన ధర్మము, చెడని పదార్ధము చేరునే మీవెంట.
(పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా)

చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంటా
ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంటా
(చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట
చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట)

రమతే యమునా

రమతే యమునా
భక్త జయదేవ
గానం: బాలమురళీకృష్ణ

రమతే యమునా పుళినవనే
విజయీ మురారి రధునా
రమతే యమునా పుళినవనే

సముదితమదనే రమణీవదనే చుంబనవలితాధరే
మృగమదతిలకం లిఖితి సపులకం మృగ మివ రజనీకరే! (రమతే)

ఇహ రసభణనే కృతహరి గుణనే మధురిపు పదసేవకే
కలియుగ చరితం న వసతు దురితం
కవినృపజయదేవకే (రమతే)

ఘనచయ రుచిరే రచయతి చికురే తరళిత తరుణాననే
కురవకకుసుమం చపలాసుషమం రతిపతింఋగ కాననే

ఘటయతి సుఘనే కుచయుగ గగనే మృగమద రుచి రూషి తే
మణివర మమలం తారకపటలం నఖపదశశి భూషితే

జితబిసశకలే మృదుభుజ యుగళే కరతల నళినీదళే
మరకతవలయం మధుకరనిచయం వితరతి హిమశీతళే

రతిగృహ జఘనే విపులా పఘనే మనసిజ కనకాసనే
మణిమయ రసనం తోరణహసనం వికిరతి కృతవాసనే

చరణకిసలయే కమలా నిలయే నఖమణి గణపూజితే
బహిరప వరణం యానక భరణం జనయతి హృది యోజితే

రమయతి సుదృశం కామసి సుభృశం ఖల హలధర సోదరే
కి మఫల మనసం చిర మిహ విరసం వద సఖి విటసోదరే
(అష్టపది 15, సప్తమ సర్గము రాగ: పీలు)

Meaning of రమతే యమునా

Oh my friend, the moon who is beautiful like Krishna assuages my
suffering to some extent. But he is friend of Manmadha, my enemy. So he
is causing pain to me with vengeance.

Krishna is kissing a beautiful maid on her lips. He is putting
kasturi mark on her beautiful face. which looks like deer on moon.
Murari is making Gopikas delightful on the sands of Yamuna river.

He is decorating Gopikas' cloud-like black hair with beautuful "kuruvaka" flowers. It was looking like a deer in dark forest.

He is drawing beautiful figures with Kasturi on their  breasts.
Gem-studded necklaces on her bosom are shining like garlands of stars
in the sky.

Gopika's arms are tender like lotus stems. Krishna is decorating her with
emerald bracelets .

Krishna is decorating her waist with gem-studded chain. Her loins are like Manmadha's golden throne.

His chest is abode for Lakshmi.Her red colored feet made his chest red.
It appeared like red rubies are on his chest.

Krishna is enjoying the company of some other maid. Tell me why I should wait in vain for him in this cottage.

Jayadeva the king among poets, sings these lovely deeds of Krishna,
meditating upon his lotus feet in his mind. Let not sins of Kali effect
anyone.

మానస సంచరరే


మానస సంచరరే
సదాశివబ్రహ్మేంద్ర
శ్యామా రాగం
28 హరికాంభోజి జన్య
ఆది తాళం

గానం: బాలమురళీకృష్ణ


పల్లవి

మానస సంచరరే బ్రహ్మణీ మానస సంచరరే

చరణం 1

మదశిఖి పించ్చాలంకృత చికురే మహనీయ కపోల విజితముకురే

చరణం 2

శ్రీ రమణీ కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే

చరణం 3

పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళిర్వధరే


Oh, take your wandering mind…to the brahman
whose breathtaking hairlocks are adorned with the eye of the peacock feather
whose gorgeous forehead is the mirror of victory

who resides in the bosom of the consort goddesses

to whom devotees offer flowers in temples

the supreme one… whose face shines like the moon

the one who surrounds all with the music of his flute.

ఏమి సేతురా లింగా ఏమి సేతురా

జీవిత సత్యాలను చెప్పుకోడానికి  తెలుగులో ఒక బ్రహ్మాండమయిన ప్రక్రియ ఉంది... అవే "తత్వాలు".
చర్నాకోలా తో కొట్టినట్లుండే ఆ తత్వబోధల సారాంశం ఒక్కటే...
"జీవుడా! నీ పరుగు ఆపి....ఆ దేవ దేవుని చరణాల మీద సాగిలబడు"....అని.
అందులో ఒక జనరంజకమయిన, ప్రఖ్యాతమయిన తత్వాన్ని క్రింద పంచుకుంటున్నాను.
పాడింది గాన మహేశ్వరుడు బాలమురళీకృష్ణ గారు.

ఏమి సేతురా లింగా ఏమి సేతురా
గంగ ఉదకం తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే
గంగనునాచేప కప్ప ఎంగిలంటున్నాది లింగ
మహానుభావ మాలింగమూర్తి మహదేవశంభో

ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
అక్షయావులపాడి తెచ్చి అర్పితము చేద్దమంటే
అక్షయావులలేగ దూడ ఎంగిలంటున్నాది లింగ

మహానుభావ మాహదేవ శంభో మాలింగ మూర్తి

ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజిద్దమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగ

మహనుభావ మహదేవశంభో మాలింగమూర్తి

కడుపెంత తా కుడుచు

మానవులు తమ జానెడు పొట్ట పోషణకై ఎన్నో కష్టాలు పడుతున్నారు. చెయ్యరాని పనులు చేస్తున్నారు. అలా చెయ్యటమెందుకు అని ఈ పాట పల్లవిలో ప్రశ్నిస్తున్న అన్నమయ్య చరణాల్లో మానవులకు ధర్మబోధ చేస్తున్నాడు. తోటి మానవుల పట్ల దయ, వాత్సల్యం చూపించాలి కాని వారి మనసులను కష్టపెట్టరాదు. ఒకవేళ ఇతరులను కష్టపెడుతూ జీవిస్తుంటే, పరితాపకరమైన ఆ బ్రతుకూ ఒక బ్రతుకేనా? ఇతరులు ఉన్నత స్థానాలకు చేరుతుంటే చూచి సంతోషించాలి. ఈ శరీరము పరులకు చేయు ఉపకారాలన్నీ తనకు తాను చేసుకున్నవిగా చెప్పనియట్టి చదువెందుకు? అంటూ ఘాటుగా చెప్పిన అన్నమయ్య చివరి చరణంలో శ్రీ వేంకటేశ్వరుని సేవాకైంకర్యానికి ఉపయోగపడని సిరిసంపదలు ఎందుకు? హరిని ఆత్మలో చింతించని పదవులెందుకు? అని భౌతిక సుఖాలను ఈసడిస్తున్నాడు. ఇవన్నీ మానవత్వం, దయ, కరుణ, సేవ, సౌభ్రాతృత్వం లాంటి గుణాలను మానవుడు అవలంబించాలని చెప్పేందుకు మాత్రమే హెచ్చరికలు. మానవునికి బంధాలను మీరి డబ్బు, వ్యాపారం, కాంక్ష మిన్నకాకూడదని చెప్పేవి మాత్రమే. అంతేగానీ నీతి, యోగ్యత, న్యాయబుద్ది, సత్యము, నిజాయితి, నిష్కపటములతో మానవులందరూ తమతమ వ్యాపార కార్యకలాపాలు అసలే మానేసి మిన్నకుండమని చెప్పేందుకు కాదు.

కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై
పడని పాట్లనెల్ల పడి పొరలనేలా

పరుల మనసునకు నాపదలు కలుగ గచేయు
పరితాపకరమైన బ్రతుకేల
సొరిది ఇతరుల మేలుచూచి సైపగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిది ఏలా

ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు
చదివి చెప్పనియట్టి చదువేలా
పొదిగొన్న యాసలో బుంగడై సతతంబు
సదమదంబై పడయు చవులు తనకేలా

శ్రీ వేంకటేశ్వరుని సేవానిరతికి గాక
జీవన భ్రాంతిపడు సిరులేలా
దేవోత్తముని యాత్మతెలియనొల్లక పెక్కు
త్రోవలేగిన దేహి దొరతనం బేలా

కుడుపు = తిండి;
పాటులు = అవస్థలు
పరితాపకరము = (ఇతరులకు) బాధ కలిగించునది (లేదా) (ఇతరులదృష్టిలో) అయ్యో! పాపమనిపించుకొన్నది;
సొరిదిన్ = క్రమముగా
చదివిచెప్పని యట్టి చదువు = శ్రుతి స్మృత్యాదుల నుదహరించి చెప్పని విద్య;
పొదిగొన్న = గుంపులుగా పైబడిన;
బుంగుడై = బుంగుడు వడి, మునిగి;
సదమదంబై = నలుగుడువడి;
చవులు = రుచులు

ఖేలతి మమ హృదయే రామః


సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి కీర్తనలు
ఖేలతి మమ హృదయే రామః
అఠాణా - ఆది

గానం: బాలమురళీకృష్ణ

పల్లవి:

ఖేలతి మమ హృదయే రామః
ఖేలతి మమ హృదయే॥

చరణము(లు):

మోహ మహార్ణవ తారకకారీ
రాగద్వేష ముఖాసుర మారీ॥

శాంతి విదేహసుతా సహచారీ
దహరాయోధ్యా నగరవిహారీ॥

పరమహంస సామ్రాజ్యోద్ధారీ
సత్యజ్ఞానానంద శరీరీ॥

ఎందరో మహానుభావులందరికి


ఎందరో మహానుభావులందరికి వందనము
త్యాగరాజు
శ్రీ - ఆది
గానం: బాలమురళి

పల్లవి:

ఎందరో మహానుభావు లందరికి వందనము ఎం..

అను పల్లవి:

చందురు వర్ణుని యంద చందమును హృదయార
విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా రెం..

చరణము(లు):

సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం..
మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగఁ బొడగనెడు వా రెం..

సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వా రెం..

పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగములఁ దెలియు వా రెం..

హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం..

హొయలుమీర నడలు గల్గు సరసుని
సదాకనులఁ జూచుచును పులక శ
రీరులై యానందపయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల వా రెం..

పరమ భాగవత మౌనివర శశి
విభాకర సనక సనందన
దిగిశ సుర కింపురుష కనకకశిపు
సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక
సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక ఎం..

నీ మేని నామ వైభవంబులను
నీ పరాక్రమ ధై
ర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమున రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సంతతంబునను గుణ భజనా
నంద కీర్తనము జేయు వా రెం..

భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మముల\న్‌ శివాది షణ్మతముల
గూఢముల\న్‌ ముప్పదిముక్కో
టి సురాంతరంగముల భావంబుల
నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య
ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా రెం..

ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచువారు
రామభక్తుఁడైన త్యాగ
రాజనుతుని నిజదాసులైన వా రెం..