January 9, 2020
అమృతవర్షంలా
అమృతవర్షంలా.... నాపై కురిసావురా
చిత్రం : అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం : శ్రీ కృష్ణ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : చిత్ర, హరీష్ రాఘవేంద్ర
అమృతవర్షంలా నాపై కురిసావురా..
అమృతవర్షంలా
నాపై కురిసావురా
ప్రియుడై పిలిచావురా
నిజమై నిలిచావురా
అమృతవర్షిణిలా
నన్నే కలిశావులే
మెరుపై మెరిసావులే
వలపై కురిసావులే
సరసానికి సంతోషం ఎదురైన వేళ
పరువాలకి తెరతీసే తొలి సంబరాల
శోభనరాగాల...లోన
చొరబడు ఎదలోన
అమృతవర్షిణిలా
నన్నే కలిశావులే
మెరుపై మెరిసావులే
వలపై కురిసావులే
చరణం 1:
గోదారిగట్టు చెట్టు పిట్ట పాట మన స్నేహం
తెలుగింటి కట్టు బొట్టు ఒట్టు మన బంధం
ఆకాశం చుక్కలు దిక్కులు నెలవంక మన సాక్ష్యాలే
చైత్రాలు వైశాఖాలు ఇద్దరి సరసాలు
నన్నేలే రాణులే నవ్వుల రాగాలు
కొమ్మల్లో మ్రోగేలే మంగళ వాద్యాలు
కుకు కుకుహు కోయిల నేనై
ఆమని నీవై జీవనగీతం పాడాలే
నువ్వు నేనైన వేళా
అమృతవర్షిణిలా...
నన్నే కలిశావులే
మెరుపై మెరిసావులే
వలపై కురిసావులే
చరణం 2:
నీ నవ్వే తెల్లని తెల్లని గొల్లల మల్లెల మధుమాసం
నీ చూపే వెన్నెలకాకల కాముని కార్తీకం
నీతోనే గానం పానం భోనం మన్మథ సోపానం
నీకే నా యవ్వనసీమల పున్నమి సన్మానం
నువ్వే నా ఊహల మువ్వల కోలాటం
నీవల్లే ఈ చెలి పొందును ఆనందం
నీ వెంటే తానా అంటూ తందానంటూ
జతగా అంటి ఉంటానే
నిండు నూరేళ్ళు హాయిగా
అమృతవర్షంలా
నాపై కురిసావురా
ప్రియుడై పిలిచావురా
నిజమై నిలిచావురా
అమృతవర్షిణిలా
నన్నే కలిశావులే
మెరుపై మెరిసావులే
వలపై కురిసావులే
సరసానికి సంతోషం ఎదురైన వేళ
పరువాలకి తెరతీసే తొలి సంబరాల
శోభనరాగాలలోన
చొరబడు ఎదలోన
అమృతవర్షంలా
నాపై కురిసావురా
ప్రియుడై పిలిచావురా
నిజమై నిలిచావురా