Showing posts with label రాజ్-కోటి. Show all posts
Showing posts with label రాజ్-కోటి. Show all posts

ఒళ్ళే పూతరేకు

ఒళ్ళే పూతరేకు 
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: వేటూరి
గానం: చిత్ర, బాలు 

పల్లవి: 

ఒళ్ళే పూతరేకు 
వాటేసుకుంటే సోకు 

ఆమ్మో అంటుకోకు 
అబ్బ రాలుతుంది రేకు 

విచ్చే వేళలో 

ఇచ్చే ఠీవిలో 

మొగలిపూల మగ యవ్వనం 

పగలే కోరే సొగసే దినం 

తనువందించే తాంబూలంలో 
ఒళ్ళే పూతరేకు 
వాటేసుకుంటే సోకు 

ఆమ్మో అంటుకోకూ 

ఓ ప్రియా ప్రియా ప్రియా

ఓ ప్రియా ప్రియా ప్రియా
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: భువనచంద్ర
గానం: చిత్ర, బాలు 

పల్లవి:

ఓ ప్రియా ప్రియా ప్రియా

దిల్ దియా దియా దియా

కన్నెసిగ్గు బరువాయే 
కంటినిద్ర కరువాయే 

పిచ్చిప్రేమ రెచ్చిపోయే 
తెల్లవార్లు జాతరాయే 

ఓ ప్రియా ప్రియా ప్రియా

దిల్ దియా దియా దియా

ఈడొచ్చి పడ్డాది

ఈడొచ్చి పడ్డాది 
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: భువనచంద్ర
గానం: చిత్ర, బాలు 

పల్లవి:

ఈడొచ్చి పడ్డాది ఒడిలోనా.... 
ఎన్నీయల్లో ....

తోడొచ్చి తొంగుంట పిల్లదానా.... 
ఎన్నీయల్లో....

అడ్డుకుంది మోమాటం 
ముడి విప్పమంది ఆరాటం
 
గోడమీది పిల్లివాటం 
ఇక చాలు చాలు బుల్లో 
చేరనీవే ఒళ్ళో

ఇది రాగమైనా అనురాగమే

ఇది రాగమైనా 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: బాలు, చిత్ర

పల్లవి:

ఇది రాగమైనా అనురాగమే 
తొలి అనుభవ గీతమిదే
ఇది రాగమైనా అనురాగమే
కన్నులే ఎద జల్లగా...
కాటుకే హరివిల్లుగా 
జత పడిన మనకు శృతి కలిసెనిపుడు 
ప్రియతమా మధుర లయే కదా మనుగడ

ఇది రాగమైనా అనురాగమే 
తొలి అనుభవ గీతమిదే

ఇది రాగమైనా అనురాగమే 

నీ కాటుక కన్నుల తళుకే



నీ కాటుక కన్నుల తళుకే
చిత్రం: నా పిలుపే ప్రభంజనం (1986)
సంగీతం: రాజ్-కోటి
గానం: రాజ్ సీతారామ్, సుశీల

పల్లవి:

నీ కాటుక కన్నుల తళుకే
నను రారమ్మనే
నీ బిగి కౌగిలిలో కులుకే
నను లే లెమ్మనే

గడసరి మగసిరి వాడివనే  
నిను కోరేనులే
నా సరి సొగసరి వాడివనే
నిను చేరేనులే...

బేట్రాయి సామి దేవుడా


బేట్రాయి సామి దేవుడా
రాయలసీమ జానపదం 
సంగీతం: రాజ్-కోటి 
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ 
 
బేట్రాయి సామి దేవుడా-
నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా

మోగదు రాగం


మోగదు రాగం 
తపస్సు (1995)
గానం: మాల్గాడి శుభ 
సంగీతం: రాజ్-కోటి 
రచన: వెన్నెలకంటి 

పల్లవి:
 
మోగదు రాగం శూన్యంలో
వెలగదు గగనం గ్రహణంలో 
అడవిని కాచే వెన్నెల నాది 
ఆశలు రాలే ఆమని నాది
పగిలిన ఈ నావ తీరమేదీ 

మల్లెల తీగల


మల్లెల తీగల
భలే మావయ్య (1994)
రాజ్-కోటి
బాలు, చిత్ర

పల్లవి:

మల్లెల తీగల ప్రేమ సితార మన్మథరాగంలో
ఇద్దరి కన్నుల అల్లరి చేసిన సంధ్యారాగంలో
కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో
ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో
వారెవా జోరు హై జోరులో ప్యార్ హై
మల్లెల తీగల ప్రేమ సితార మన్మథరాగంలో

కలగా వచ్చినావు....


కలగా వచ్చినావు
పోకిరీరాజా (1995)
రాజ్-కోటి
చిత్ర, బాలు
సిరివెన్నెల

కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
వహ్వా నచ్చినావు తహతహ కలిగించినావు 
మదనా ఓ నా మదన మదన మదనా
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
యమగా రెచ్చినావు జలజలజల కురిసినావు
లలనా ఓ హూ లలన లలన లలనా
అందొచ్చిన అందాలను వదిలేయకు
పొంగొచ్చిన గంగల్లే అల్లేయకూ   
సరదా పడవా
చెబితే వినవా
మరీ అలా బెట్టెందుకు
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
లలనా ఓ హూ లలన లలన లలనా

మొదటి మోజులు రేగే వేళకి


మొదటి మోజులు
హలో అల్లుడు (1994)
బాలు, చిత్ర
రాజ్-కోటి

మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా...
విరహ జాబిలి
వేగే వేళకి వాటేస్తే ఏం జేస్తావ్?
సోకుల్లో చోటిస్తా
చిత్తైపోతున్నా
నీకు మత్తెక్కిస్తున్నా
ముంగిట్లో ముద్దూ
ముచ్చట్లాడిస్తుంటే ఓడిస్తుంటే
ఎంతో హాయీ

మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా...

చరణం 1 :

ఈదురుగాలి ఈడుగ మారి
చేసెనులే గోలలు నీలో
ఈ దొరగారి
తొందర చూసి
రేగెనులే ఈలలు నాలో
మల్లీ జాజీ మధువే
నీ అందాలే చిలికె సుమా
విచ్చే మొగ్గ గిల్లు
గుచ్చే తేనే ముల్లు
వేడెక్కించి ఒళ్ళు
ఢీడిక్కాడి వెళ్ళు
కోరే కన్ను కొట్టేకన్ను
కోలాటంలో
మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా

చరణం 2 :

వెచ్చని తోడు
మచ్చిక గూడు
జాబిలితో రాతిరి గోల
తెల్లని చీర
వెన్నెల డేర
కౌగిలిలో కమ్మని లీల
కొత్తందాలే ఒలికే
మొత్తం నీకై దాచుకుని
సింగారంలో తడిసి
సిగ్గంటిస్తే తుడిచి
రూపాలెన్నో కలిసి
దీపంలాగా మెరిసి
రూపూ రేఖా రాజీ లేకా
అందే వేళా
మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా...
విరహ జాబిలి
వేగే వేళకి వాటేస్తే ఏం జేస్తావ్?
సోకుల్లో చోటిస్తా
చిత్తైపోతున్నా
నీకు మత్తెక్కిస్తున్నా
ముంగిట్లో ముద్దూ
ముచ్చట్లాడిస్తుంటే ఓడిస్తుంటే
ఎంతో హాయీ

ఒకటే తనువంతా


ఒకటే తనువంతా
చిత్రం : బాల గోపాలుడు (1989)
సంగీతం : రాజ్ - కోటి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత

సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె
వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. 
కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా


ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
బంగారు బుల్లోడు (1993)
రాజ్-కోటి
వేటూరి
బాలు, చిత్ర

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట
ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

జోరుగున్నాది గులాబి గుంటది


జోరుగున్నాది గులాబి గుంటది
ముఠా మేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, చిత్ర

జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
అరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా

ఝుమ్మనే తుమ్మెద వేట


ఝుమ్మనే తుమ్మెద వేట
చిత్రం : మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం : రాజ్ - కోటి
సాహిత్యం : భువన చంద్ర
గానం : బాలు, చిత్ర

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామ అదేలే ప్రేమ
జగదేక వీర శూర తరించైనా
సరసాల సాగరాలె మధించైనా
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట

చందమామ కన్నుకొట్టె


చందమామ కన్నుకొట్టె
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
నేపథ్య గానం: బాలు, చిత్ర

పల్లవి: 

చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ

అందమంత ఆరబెట్టి పైటజారె
కోడెగాలి కొట్టగానె కోకజారె
పడలేనీ ఆరాటం

పగలే వెన్నెలాయే జగమే మనదాయే


మన్మధుణ్ణే మధ్యవర్తై ఉండమందాం ...
చిత్రం : పరువు ప్రతిష్ట (1993)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో


ఓ నాన్నా నీ  నాన్న కన్నుల్లో
భగవాన్ (1989)
రాజ్-కోటి
బాలు, జానకి

ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో వెన్నెల్లు నీవేనురా
నీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా?
నేనున్నా లేకున్నా ఈపాటే నీ తోడు కావాలి.
ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో వెన్నెల్లు నీవేనురా
నీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా?

మురిపాలు పంచగా
నీ అమ్మ లేదురా
సిరులందు పెంచగా
నీ నాన్న పేదరా

అందమా అందుమా అందనంటే అందమా

అందమా అందుమా
చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

అందమా అందుమా 
అందనంటే అందమా
చైత్రమా చేరుమా 
చేరనంటె న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ 
పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ 
పాలసంద్రమా

అందమా అందుమా 
అందనంటే అందమా

చైత్రమా చేరుమా 
చేరనంటె న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ 
పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ 
పాలసంద్రమా...

ఆడుమా పాడుమా 
మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా 
అందనంటే అందమా

చరణం 1 :

ఆకలుండదే.... దాహముండదే .. 
ఆకతాయి కోరిక,,,
కొరుక్కుతింటదే...
ఆగనంటది దాగనంటది 
ఆకుచాటు వేడుక....
కిరుక్కుమంటది

వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి ..
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి..
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తా సుమ్మి
ఆలనా పాలనా 
చూడగా చేరనా చెంత...

అందమా అందుమా 
అందనంటే అందమా
చైత్రమా చేరుమా 
చేరనంటె  న్యాయమా

చరణం 2 :

వెయ్యి చెప్పినా... లక్ష చెప్పినా 
లక్ష్యపెట్టదే ఎలా...? 
ఇదేమి విలవిలా...
తియ్య తియ్యగా నచ్చ చెప్పని ..
చిచ్చు కొట్టనీ  ఇలా ..
వయ్యారి వెన్నెల

నిలవనీదు నిదరపోదు నారాయణ..
వగల మారి వయసు పోరు నా వల్లనా...
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా..
ఆదుకో నాయనా... 
ఆర్చవా... తీర్చవా.. చింత

అందమా అందుమా 
అందనంటే అందమా

చైత్రమా చేరుమా 
చేరనంటె న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ 
పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ 
పాలసంద్రమా...

ఆడుమా పాడుమా 
మౌనమే మానుకోవమ్మ

ఓ నవీనా..నవీనా..నవీనా

ఓ నవీనా..నవీనా..నవీనా
గోవిందా గోవిందా (1993)
సంగీతం::రాజ్ కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర

పల్లవి::

ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

ఓ నవీనా నవీనా నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో
ఓ నవీనా నవీనా నవీనా..ఆ ఆ ఆ

చరణం::1

కోకనైన కాకపోతి కొమ్మచాటు సోకులన్నీ
తడిమే వేడిలో
కౌగిలైన కాకపోతి ఆకలైన అందమంతా
అడిగే వేళలో

నీలోని తడి అందాలు..శృంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా స్వప్నాలు
వసంతమాడే వయస్సు నీదే
అది తెలిసిన సరసుడు..కలిసిన పురుషుడు జతపడితే

ఓ నవీనా ఆహా హా ఆహాహా..
ఓ నవీనా నవీనా..ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా..ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

చరణం::2

ఒంపులోన సొంపులిచ్చి..చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేళలో
నిద్దరోని కొత్తపిచ్చి నిన్ను చూసి..కన్నుగిచ్చి కలిసే ఆశలో
అల్లారు వయ్యారాలే..అల్లాడిపోయే వేళ
చల్లారు పొద్దుల్లోన..ఊపెయ్యనా ఉయ్యాల
ఇదేమి గోలా..ఆ ఆ ఆ..వరించు వేళ
మనసెరిగిన సొగసరి..మదనుడి మగసిరి కలబడితే

ఓ హోహో..నవీనా నవీనా నవీనా
ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
గాలి గిలిగింత చెలి గాలి పులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిడో
మ్మ్..ఆహాహా..ఒహోహో

అమ్మ బ్రహ్మదేవుడో

అమ్మ బ్రహ్మదేవుడో
గోవిందా గోవిందా (1993)
సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల 
గానం::బాలు, చిత్ర, మాల్గాడి శుభ

ఉయ్.. టముకెయ్ డుండుండిగా
సందడి సెయ్ తమాషగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయ్ రా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికిరాగా

అమ్మ బ్రహ్మదేవుడో....
కొంప ముంచినావురో....
ఎంత గొప్ప సొగసురో...
యాడ దాచినావురో...
పూల రెక్కలు...
కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో... 
ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...?
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా..!

కనురెప్పలు పడనప్పుడు 
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది 
కల్లై పోదుగా...!

కనురెప్పలు పడనప్పుడు 
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది 
కల్లై పోదుగా

ఒకటై సిన్నా పెద్దా అంతా సుట్టూ చేరండి
తకతై ఆటాడించే సోద్యం చూడండి
చంద్రుళ్ళో కుందేలు
సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా...
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మదేవుడో 
అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో 
యాడ దాచినావురో

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

మహగొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

అప్పనా తన్నమన్నా కథం తొక్కే పథానా
తప్పనా తన మన తేడాలేమైనా

తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులు థిల్లానా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

అమ్మ బ్రహ్మదేవుడో 
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో 
యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...

ఉయ్.. టముకెయ్ డుండుండిగా
సందడి సెయ్ తమాషగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయ్ రా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యా ఏడుకొండలు దిగి కిందికిరాగా...