January 19, 2020

ప్రేమ అన్నది ఒక కల..


ప్రేమ అన్నది ఒక కల..
బ్రహ్మముడి (1985)
గానం: కె.జె.ఏసుదాస్
సంగీతం: చంద్రశేఖర్
రచన: దాసరి

ఓ..ఓ...ఓ..ఓ...ఓ..
ప్రేమ అన్నది ఒక కల..
కలా.. కలా
చిక్కు కుంటే అది వల...
వల.. వలా
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా
పిదప ఎగిరిపోతుంది కాకిలా
కడకు విడిచిపోతుంది ఏకాకిలా...
ఏకాకిలా...ప్రేమ అన్నది ఒక కల
కలా.. కలా
చిక్కు కుంటే అది వల...
వల.. వలా

చరణం 1:

మనసు అనే మల్లెమొగ్గపై
ఆశ అనే తుమ్మెదల్లే
వాలుతుంది రసవంతంగా,
చేరుతుంది బలవంతంగా 
చేరి మొగ్గ పై మొగ్గలేస్తుంది
అది ముక్కలైతే ఎగిరి పోతుంది
మరో మొగ్గపై వాలుతుంది కొత్తగా..
కొత్తగా

ప్రేమ అన్నది ఒక కల..
కల ... కల
చిక్కు కుంటే అది వల...
వల... వల

చరణం 2:

వయసు అనే పూలబండిపై...
పెళ్లి అనే గూడును కట్టీ
ఆపుతుంది నెమ్మదిగా ...
ఎక్కుతుంది ఆనందంగా.... 
ఎక్కి బండినే పడదోస్తుంది
అది పడుతుంటే... పారిపోతుంది
మరో బండిపై ఎక్కుతుంది కొత్తగా ..
కొత్తగా....

ప్రేమ అన్నది ఒక కల..
కలా.. కలా
చిక్కు కుంటే అది వల...
వల.. వలా
మొదట సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా
పిదప ఎగిరిపోతుంది కాకిలా
కడకు విడిచిపోతుంది ఏకాకిలా...
ఏకాకిలా...
ఓ..ఓ...ఓ..ఓ...ఓ..