Showing posts with label గోపికా పూర్ణిమ. Show all posts
Showing posts with label గోపికా పూర్ణిమ. Show all posts

ఏదో ఏదో నాలో

ఏదో ఏదో నాలో
నీ మనసు నాకు తెలుసు (2003)
రెహమాన్
రత్నం, శివ గణేష్
కార్తీక్, గోపికా పూర్ణిమ

ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్యరేఖ వరియించెలే
ప్రేమరేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టెనులే
ప్రియతమా...హృదయం
నీకే....నీకే

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా


నేస్తమా...
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గురుచరణ్
గానం: బాలు, గోపికా పూర్ణిమ

మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగీ నేలా నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఈ గుండెలోన నీ ఊపిరుంటే... 
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే....
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే...
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే....

మిల మిల మెరిసే

మిల మిల మెరిసే
పెళ్ళాం ఊరెళితే (2003)
మణిశర్మ
సిరివెన్నెల
బాలు, గోపికా పూర్ణిమ

|పల్లవి||

మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా
నిగ నిగలాడే భామా నునులేత పసిడి కొమ్మా
గడసరి పలుకుల గువ్వా నువు మదనుడి మరదలివా
గుబ గుబలాడెను ఊటి నిను చూసి అయ్యోరామా
కళ్ళే చూసెనంటె KODAK..... పళ్ళే చూసెనంటె CLOSE-UP
థ్రిల్లై గంతులేస్తు రావా నీకోసం.......
కురులే చూసెనంటె SUNSILK..... నవ్వే చూసెనంటె NESCAFE
తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం....... ||మిల మిల||

||చరణం 1||

మెరుపులన్ని మెలివేసి....... తారలన్ని కలబోసి.....
పున్నమంత మరిగించి...... పుణ్యమంత కరిగించి......
నవ నవలాడేలా నవ బ్రహ్మలు చేరి.....
తన్మయమై నిన్ను చేశారే కోరి
పలుకే వినినా తేనే చినబోవు
సొగసే కనినా తూర్పుకు మతిపోవు
కలరే చూసెనంటె ASIAN..... రిస్టే చూసెనంటె TITAN.....
నీకై లక్షలుంచిపోవా వాకిట్లో...... ||మిల మిల||

||చరణం 2||

కాలి అందె కదిపిందా...... కాకి కోకిలై పోదా.....
పైట గాలి వీచిందా..... పాలవాన పడిపోదా......
రుసరుస చూసిందా ఋతువులు మారేను
గుసగుస లాడిందా ఋషులే మారేను
కదిలే నడుమే చూస్తే హరివిల్లు
బిడియం పడుతూ నీకే ప్రణమిల్లు
నడకే చూసెనంటె BATA..... పరుగే చూసెనంటె SCOOTY.....
సంతోషించి ఇచ్చుకోవా ఎంతైనా....... ||మిల మిల||

ఎక్కడ ఉన్నా పక్కన


ఎక్కడ ఉన్నా పక్కన
నువ్వే కావాలి (2000)
సిరివెన్నెల
కోటి
గోపికా పూర్ణిమ, శ్రీరామ్

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే 
ఉన్నట్టుంటుంది
చెలీ.. ఇదేం అల్లరీ....
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే.. ఇదేం గారడీ....
నేను కూడా నువ్వయ్యానా..
పేరు కైనా నేను లేనా..
దీని పేరేనా.. 
ప్రేమ అనే ప్రియభావనా..
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావనా..
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే 
ఉన్నట్టుంటుంది
చెలీ.. ఇదేం అల్లరీ

చరణం 1:

నిద్దుర తుంచే మల్లెల గాలి
వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే.. కాదా.. చెప్పు ఆ పరిమళం

వెన్నెల కన్నా చల్లగ ఉన్న 
చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం

కనుల ఎదుట నువు లేకున్నా
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో 
నీకైనా తెలుసునా
ఏమిటవుతుందో ఇలా 
నా ఎద మాటునా...
ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావనా..

చరణం 2:

కొండల నుంచి కిందికి దూకే 
తుంటరి వాగు నాతో అంది
నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ

గుండెల నుంచి గుప్పున ఎగసే 
ఊపిరి నీకో కబురంపింది
చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ

మనసు మునుపు ఎపుడూ ఇంత
ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింతా
ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావనా..