గోల్డు రంగు పిల్ల
శైలజారెడ్డి అల్లుడు (2019)
సంగీతం: గోపీ సుందర్
రచన: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, బెహరా,
మోహన భోగరాజు, హరిప్రియ
పోరి పోరి సత్యభామ
దుమ్ము దులిపి వెళ్ళెనంట
విచ్చుకున్న మాట వచ్చి గుచ్చెనంటా...
కిట్టమూర్తికింక మొదలు
కొంటె తంటా....
గోల్డు రంగు పిల్ల...
గుండె దోచుకుంది ఇల్లా....
సౌండే చెయ్యకుండా
ఆడుగుపెట్టి వచ్చెనిలా...
హె పిల్లా... వెళ్ళిపోకె అల్లా
ఈ వేళా చెయ్యమంది గోలా ...
ఆ బంగారు చేపల్లె
వయ్యారం వొంపేసి జారితె ఎల్లా
మాట వినవె పిల్లా
చూపావే ప్రేమ చాలా
మరి ఇంతలోనె నీకీ అలకేలా...
మాట వినవె పిల్లా
చేస్తావె అంత గోలా
మరి ఇంతలోనే నీకీ తగువేలా...
పంచకట్టు పక్కనెట్టి
పంచులన్ని మూటగట్టి
కంచెలన్ని తెంచుకున్న
కొంటె కృష్ణుడే
సత్యభామనేరికోరి వచ్చినాడే....
కళ్ళకున్న కాజల్ కూడా
కబురులాడెనంటా....
కళ్ళల్లోని కలలు మొత్తం
నీకు చెప్పవంటా
చేతికున్న గాజులు కూడా
ఊసులాడెనంటా
గుండెలోని గొడవ మాత్రం
నీకు చూపవంటా
కాలికున్న పట్టీ కూడా పలుకుతుందిగా
వెంట వెంట రాకు అంటు తిట్టుతుందిగా
చంటి పాపాయి నే చూడు
ఎక్కిళ్ళు పెట్టైనా ఏదోటి చెబుతుందిలే
అంత ఈజీగా మేమేంటో
చెప్పేసే వీలుంటే
మాకింత ఫాలోయింగ్ ఉండదే
మాట వినవె పిల్లా
నువ్వు మాట వినవె పిల్లా
దాచేయ్ కు మాటలిల్లా మధుబాలా....
మాట వినవె పిల్లా
చేస్తావె అంత గోలా
మరి ఇంతలోనె నీకీ తగువేలా
గోల్డు రంగు పిల్లా...
గుండె దోచుకుంది ఇల్లా....
సౌండే చెయ్యకుండా
ఆడుగుపెట్టి వచ్చెనిలా
హె పిల్లా... వెళ్ళిపోకె అల్లా
ఈ వేళా చెయ్యమంది గోలా ...
ఆ బంగారు చేపల్లే
వయ్యారం వొంపేసి జారితె ఎల్లా
మాట వినవె పిల్లా
నువ్వు మాట వినవె పిల్లా
మాటాడవెందుకు నాలా
నలుగురిలా...
దాయాల చంటి పిల్లా
చేస్తావె గారమిల్లా
మరి అంతలోనె దూరం అవ్వాలా
మాట వినవె పిల్లా
నువ్వు మాట వినవె పిల్లా
మాటాడవెందుకు నాలా
నలుగురిలా...
దాయాల చంటి పిల్లా
చేస్తావె గారమిల్లా
మరి అంతలోనె దూరం అవ్వాలా