Showing posts with label ఎస్.వి. కృష్ణారెడ్డి. Show all posts
Showing posts with label ఎస్.వి. కృష్ణారెడ్డి. Show all posts

ప్రేమ ఓ ప్రేమా

మనసులో మాట (1999)
రచన: సిరివెన్నెల
సంగీతం: ఎస్వీ కృష్ణారెడ్డి 
గానం: చిత్ర

పల్లవి : 

ప్రేమ ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా హయ్యో రామా

గుమ్మందాకా వచ్చి
ఇపుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి
నిన్ను ఆరాతీస్తాలేమ్మా
ఇకపై నువ్వే నా చిరునామా

ప్రేమా ఓ ప్రేమ వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా హయ్యో రామా

తారక దిగివచ్చి


తారక దిగివచ్చి
ఊయల (1998)
బాలు, చిత్ర
చంద్రబోస్
ఎస్వీ కృష్ణారెడ్డి

తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే
కాదనగలనా... కాదనగలనా
మెరుపే ఎదురొచ్చి చురుక్కున చుట్టేస్తే
కాదనగలనా... కాదనగలనా

ఇప్పటికిప్పుడు రెప్పల్లో


ఇప్పటికిప్పుడు రెప్పల్లో
ప్రేమకు వేళాయెరా(1999)
చిత్ర, ఉన్ని కృష్ణన్,
ఎస్.వి. కృష్ణారెడ్డి

ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో

ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి
ప్రేమకి వేళయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి

ఏం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎలా మరి
మాటలేవి వద్దు చేరుకోమని
చిలికి చినికి ఉలికి పడే
చిలిపి వలపు చినుకు సడి

కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ

స్వచ్ఛమయిన తెలుగు పాట....రెండు మలయాళ గాత్రాలతో...

కోదండరామయ్యకు..
చిత్రం : కోదండరాముడు (2000)
సంగీతం : ఎస్వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం : చంద్రబోస్
గానం : చిత్ర, శ్రీకుమార్

సయ్యకు సకజిమి సూజ సక సూజ

కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
సిరిమువ్వ నడకల్లో తిల్లానలు పలుక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక

సిరులొలికించే చిన్నినవ్వులే


సిరులొలికించే చిన్నినవ్వులే
యమలీల (1994)
గాత్రం: చిత్ర,బాలు
సంగీతం: కృష్ణారెడ్డి
రచన: సిరివెన్నెల

పల్లవి:

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా

అల్లుకుపోవే ఒసే మల్లెతీగ


అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
శుభలగ్నం (1994)
ఎస్వీ కృష్ణారెడ్డి
జొన్నవిత్తుల
బాలు, చిత్ర

అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
అందుకనె ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా

కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా

ఓలమ్మో ఓరినాయనో


ఓలమ్మో ఓరినాయనో
పెళ్ళాంతో పనేంటి (2003)
ఎస్వీ కృష్ణారెడ్డి...
చంద్రబోస్
ఉదిత్ నారాయణ్, రనీనా రెడ్డి

పల్లవి: 

ఆదివారం షికారుకి 
సోమవారం సినిమాలకి 
మంగళారం రెస్టారెంటుకి 
శుక్రవారం రాముని గుడికి 
అన్నిచోట్లకి నాతో తిరిగి 
ఆఖరికి నను మరిచి పోయాడ్రో ...
ఓలమ్మో 
ఓలమ్మో ఓరినాయనో..

ఆదివారం ఆఫీసుకి
సోమవారం షాపింగుకి 
మంగళారం మధురై బ్యాంకుకి 
శుక్రవారం చెన్నై బ్రాంచికి
అంతులేని బిజీగా ఉంటే 
ఇంతలో నీ గజిబిజి ఏందమ్మో...
ఓలమ్మో 
ఓలమ్మో ఓరినాయనో

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో


ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో
చిత్రం : ఉగాది (1997)
సంగీతం : ఎస్వీ. కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఉన్నికృష్ణన్ , బృందం

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
ఇవ్వాళే చూశా నిన్ను బాగున్నావా
వెన్నెల గువ్వా...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ
నడపమందువా
కాచుకుంది పూవుల తోవ
చూపిస్తా నాతో రావా

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వేచి ఉంది నవ్వుల నావ
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా

కళ్లు మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో
వాటి వెంట పోతూ రోజూ చూస్తానే నీ కోట
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కళ్లు తెరుచుకోగానే దారి మరిచిపోతానే
కోటి చుక్కలన్నిటి మధ్య నీకోసం చూస్తుంటా
కరిగేటి కలవో నిజంగానే కలవో
అనుమానం తీర్చేయాలని కళ్లారా కనిపించేవా

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ ...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ

ఊసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో
పాడుకుంటు ఉంటే నువ్వా రాగాలే విన్నావా
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
చుక్కలూరి వీధుల్లో ఒక్కదానివై ఉంటే
తోచుబాటు ఏమీ లేక ఈ వైపు వాలేవా
నువు రాక మునుపే నీ రూపు తెలుసే
ఎలాగంటే నాకేం తెలుసు
నా మనస్సుకి కబురంపేవా

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ ...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ

అందాల అపరంజి బొమ్మ



అందాల అపరంజి బొమ్మ
చిత్రం : ఘటోత్కచుడు (1995)
సంగీతం : ఎస్వీకృష్ణారెడ్డి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగపడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంట చెమ్మ
తను మరుగునున్నా
నిను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ.

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగపడకమ్మ

ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే తెలుసుకోమంది
ఆటాడుకోగా తోడెవ్వరంటే
అంబారిగట్టి ఆడించమంది
నీకేం కావాలన్నా
నాకు చెపుతూ ఉంటానంది
తానే లోకాన్నున్నా
నిన్ను చూస్తూ ఉంటానంది
కాపాడుకుంటా కనుపాపలాగా
నిను చూసుకుంటా మీ అమ్మలాగా
నమ్మమ్మ నా మాట..

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగపడకమ్మ

మావయ్యనంటూ నిను చేరమంది
మంచి మాటలతో మరిపించమంది
కథలెన్నొ చెప్పి నవ్వించమంది
ఒడిలోన చేర్చి ఓదార్చమంది
జో జో పాపా అంటూ
తాను రోజూ పాడే లాలి
ఇట్టా పాడాలంటూ
నాకు తానే నేర్పింది తల్లి
మా పాపనెప్పుడు కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే
పని మీద వెళ్ళింది..

అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగ పడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంట చెమ్మ
తను మరుగునున్నా
నిను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ....

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఏదంటు బెంగ పడకమ్మ

ఎఱ్ఱాకలువ పువ్వా


ఎఱ్ఱాకలువ పువ్వా
యమలీల (1994)
సిరివెన్నెల
ఎస్వీ కృష్ణారెడ్డి
బాలు, చిత్ర

డింకుటకుమ్ టకుమ్ టకుమ్
డింకుటకుమ్ టకుమ్ టకుమ్

ఎఱ్ఱాకలువ పువ్వా ఏద్దామా సలిమంట
ఎవరూ సూడని సోట పొగరాని పొదరింటా
రా మరి సాటుకి సందామామ
కౌగిలి విందుకి సందామామ
సయ్యనే కాముడే సందామామ
ఆశలే తీరనీ సందామామ
సైరా సరదా గువ్వా పండించు నా పంట
పదరా మదనా జాతర సేద్దాము పడకింటా

గాజుల మోతలో సందామామ
మోజులే మోగనీ సందామామ
తోడుగా సేరుకొ సందామామ
ప్రేమనే తోడుకో సందామామ


గిలి గిలి సల్లగాలి తగిలిందే ఓ హంస
సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్స
కేరింత కెరటాలా...... మునగాలా
కేరింత కెరటాల ఊరంత మునగాల
ఊపందుకోవాలా.. నీ పొందు కావాలా..

నీ ఒడిలో తొంగుంటా సందామామ
నీ కలలో నేనుంటా సందామామ
నా దొర నీవుర సందామామ
ఉహాలరాణివె సందామామ
సైరా సరదా గువ్వా పండించు నా పంట
పదరా మదనా జాతర సేద్దాము పడకింటా

కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా
తళుకుల పూలతీగ సరసాలా తేలాల
వయ్యారి అందాలు..... ఒడిలోనా..
వయ్యారి అందాలు గంధాలు తీయాల
మందార బుగ్గల్లో మద్దెళ్ళు మోగాల
ఏడేడు జనమాలు సందామామ
ఏలికగా ఉంటానే సందామామ
కానుకే నేనిక సందామామ
నా ఎద నీదిక సందమామ

ఎఱ్ఱాకలువ పువ్వా ఏద్దామా సలిమంట
ఎవరూ సూడని సోట పొగరాని పొదరింటా
సైరా సరదా గువ్వా పండించు నా పంట
పదరా మదనా జాతర సేద్దాము పడకింటా
గాజుల మోతలో సందామామ
మోజులే మోగనీ సందామామ
తోడుగా సేరుకొ సందామామ
ప్రేమనే తోడుకొ సందామామ

దేవతలారా రండి



దేవతలారా రండి
చిత్రం : ఆహ్వానం (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

దేవతలారా రండి 
మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే 
నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలిలోన పున్నమిపూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళతెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోటా
నిధినిక్షేపాలే నిద్దురలేచి ఎదురొచ్చేనంటా

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి
దేవతలారా రండి 
మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే 
నా తోడుని పంపించండి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

సామజవరగమన


సామజవరగమన
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమన
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోఈ హోఈ ఎన్నియల్లొ ఎన్నియల్లొ

సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమన
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోయ్ హోయ్ ఎన్నియల్లొ ఎన్నియల్లొ

చింతాకు నడుముకు సామజ సామజ
ధింతాకునకధిమి సామజ సామజ
సింగారి వయసుకి సామజ సామజ
శృంగార పున్నమి సామజ సామజ

సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమనా
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోయ్ హోయ్ ఎన్నియల్లొ ఎన్నియల్లొ

అల్లమో బెల్లమో కనెపిల్ల అందమో
పువ్వులా నవ్వితే జివ్వుమంది ప్రాణము
చెల్లియో చెల్లకో అందుకుంటి ముద్దులు
పెళ్ళితో పిల్లడో ఉండవింక హద్దులు
చిలుక సుకుమారి హంస దొరసాని
అడవి నెమలి చిందులేయ రావే

ఏవయ్యా మావయ్య జాగు ఇంకా ఏలయ్య
భామని ప్రేమని ఏలుకోగా రావయ్య
రాగమూ యోగమూ కొంగు ముడి వేయగా
అందుకో తీయగా సంబరాలు హాయిగా
పడుచు సరసాల
వయసు మురిపాల
మనసు మనసు కలిపి వలపు విరిసె

ఒక్కసారి ఒక్కసారి


ఒక్కసారి ఒక్కసారి
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

అరె తకజుం.. తకజుం.. తకజుం.. తకజుం
తకథిమి నడకల నడుములో..
నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపుపెడతా.. హోయ్..
వలపు తలపు తడతా.. హోయ్

ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

చరణం: 1

సన్న జాజుల చినుకులలో
స్నానమాడిన తమకముతో
వన్నెదేరిన వయసా వారెవా..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్ను సైగల తాకిడిలో..
ఎన్నడెరగని తహతహతో..
నన్ను లాగిన చొరవా వారెవా..

తారకలా..ఆ..ఆ
దరిచేరగ రా..ఆ

కోరికతో.. అభిసారికనై
నిలిచానా.. చంద్రమా
చూసానే అందమా

చరణం: 2

తేనె కోరే తుమ్మెదగా
చేర వస్తా నెమ్మదిగా
పూలతీగ రానా అతిథిగా

కమ్ముకొస్తే కాదనకా
కౌగిలిస్తా.. కానుకగా
తేనెటీగా రావోయ్ మృదువుగా

వందనమే..ఊఁ..ఊఁ నవనందనమా.. ఊఁ..ఊఁ
స్వాగతమా..యువదొరతనమా నిలువెల్లా ఏలుకో
జతఒళ్ళో వాలిపో..