January 18, 2020
ఈడే తుళ్ళినది
ఈడే తుళ్ళినది
చిత్రం : విజేతలు (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి
ఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ పిల్లా
తోడే కోరినది
గుండే చెదిరినది
భామా ఇయ్యాళాఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ మావా
తోడే కోరినది
గుండే చెదిరినది
మావా ఇయ్యాలా
మాయనీ సరదాలా
మత్తులో తేలాలా
మల్లెలా ఊహల్లో
సిత్రాలు సూపించాలా
ఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ పిల్లా
తోడే కోరినది
గుండే చెదిరినది
మావా ఇయ్యాలా
చరణం 1:
వగలమారి నా మావా.... రావా
సెంద్రలోకమే పోదాం....
తేనెపలుకులా భామా.. రావే
ఎండి సుక్కలే చూద్దాం...
ముద్దుముచ్చటా పంచిమ్మంటూ
గోలసేసె నా మనసే...
ముద్దరాలితో రేయీపగలు
తోడు కోరెనే వయసూ...
సూపులతో.... తీరదనీ...
చేరితినిలే...
వెచ్చని నీ ముచ్చటలే
కోరితినిలే...
ఊసులే పలికించూ...
ఎన్నెలే చిందించూ...
ఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ పిల్లా
తోడే కోరినది
గుండే చెదిరినది
మావా ఇయ్యాలా
చరణం 2:
పైరగాలితో ఏదో.. ఏదో
ఊసులాడెనే ఈడూ...
పైటకొంగులో ఏవో.. ఏవో
పలవరింతలే నేడూ...
అహహా..
పొద్దు పొడిచినా... పొద్దు గూకినా
తీరదు మన సయ్యాట..
వయసు మాటునా....
వగల చాటునా....
తరిగిపోదు ఈ సరదా...
అందుకనే.... ముందుగనే
చెయ్యి కలిపా..
తప్పదనీ... మావవనీ..
చెంత నిలిచా
నీడలా నీ చెంతా
సాగనీ బతుకంతా
ఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ మావా
తోడే కోరినది
గుండే చెదిరినది
భామా ఇయ్యాళా
ఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ పిల్లా
తోడే కోరినది
గుండే చెదిరినది
మావా ఇయ్యాలా
మాయనీ సరదాలా
మత్తులో తేలాలా
మల్లెల ఊహల్లో
సిత్రాలు చూపించాలా
ఈడే తుళ్ళినది
కోడై కూసినది ఓ పిల్లా
తోడే కోరినది
గుండే చెదిరినది
మావా ఇయ్యాలా