చిరునవ్వుల వరమిస్తావా
చిరునవ్వుల వరమిస్తావా (1993)
గాత్రం: బాలు
సాహిత్యం: వెన్నెలకంటి
సంగీతం: విద్యాసాగర్
పల్లవి:
చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను
పగలు నీవు రేయిని నేను
కలుసుకోని జంట ఇది
పగలు నీవు రేయిని నేను
కలుసుకోని జంట ఇది
పగలు నీవి సెగలు నావి
మంచులోన మంట ఇది
పగలు నీవి సెగలు నావి
మంచులోన మంట ఇది
చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను
చరణం1:
రేపులేని రేయిని నేనై చెబుతున్నా వీడ్కోలు
అశ్రువులే అక్షరాలుగా చేస్తున్నా చేవ్రాలు
నిప్పు చివర నివురుంటుంది
వలపు చివర వగపుంటుంది
నిప్పు చివర నివురుంటుంది
వలపు చివర వగపుంటుంది
నింగిజార్చు కన్నీటి ధారలో
నేల తడిసి పులకిస్తుంది
చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను
చరణం2:
ఊహలన్నీ శిధిలాలైతే ఊపిరున్న శిల నేను
కళ్ళులేని మనసున మరిగి కరుగుతున్న కల నేను
పగులుతున్న హృదయమిది
పడమటింటి ఉదయమిది
పగులుతున్న హృదయమిది
పడమటింటి ఉదయమిది
ఎద ప్రమిదకు నెత్తురు నింపి
ఎదురుచూచు దీపమిది