Showing posts with label టి.వి.రాజు. Show all posts
Showing posts with label టి.వి.రాజు. Show all posts

తోలుతిత్తి ఇది

పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపథ్యగానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం 

పల్లవి : 

తోలుతిత్తి ఇది 
తూటులు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం

ఓ జీవా తెలుసుకో అపాయం

ఆపద మొక్కులవాడా



ఆపద మొక్కులవాడా 
నిండు మనసులు (1967)
గానం: సుశీల 
రచన: సినారె 
సంగీతం: టి.వి.రాజు 

పల్లవి:

ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాసా... 
ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాస... 
అడుగడుగున కాపాడే 
తిరుమలగిరివాసా 
శ్రీనివాసా శ్రీనివాసా 

మనవి సేయవే...


మనవి సేయవే...
రేచుక్క-పగటిచుక్క (1959)
సముద్రాల రామనుజాచార్య (జూనియర్)
టి.వి.రాజు
ఘంటసాల

మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ
మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ
మనవి సేయవే

నీ చరణ కమలాల నీడయే చాలు


నీ చరణ కమలాల నీడయే చాలు
చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, పి.లీల

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు

నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు

సతీసావిత్రి ఎపిసోడ్


సతీసావిత్రి ఎపిసోడ్
చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్   
గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకం

ఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్
గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడే

ఓహోహోహో.. ఏమి ఆశ్చర్యమూ
భహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క
అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు
ఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగా

సావిత్రీ ! మానినీ ఆహ్హ్హహ్హహ్హహ్హహ్హహ్హ
నిర్నిమిత్త సందేహడోలాయ మానసవై
ఏల అట్లు దిగాలున చూచుచుంటివి
సామాన్య మనీషాగోచరంబైన
మద్రూప విశేషంబు గాంచియే
నేనెవ్వరో యూహించి ఉండజాలుదువు
ఐనను వచించెద

క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు
ఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాక
వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు
నాలుగు మూడైన అగునుగాక
పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు
తాళము తప్పిన తప్పుగాక !
చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ
పలికినా అపశృతుల్ పలుకుగాక

సకల లోకాల ధర్మశాసనము నమలు
చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానె
వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి
మోసికొని పోవుచుండు యముండ - అబలా !
సావిత్రీ ! ఇదిగో నీ పతి ప్రాణంబుల్ గొనిపోవుచున్నాడ

అయ్యో ! అయ్యో ! ఆ!
నాథా ! నాథా !

హ్హహ్హహ్హ మహిషరాజమా మరలుము
 
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !
సుంతయేని కరుణ మాని
సుంతయేని కరుణ మాని
కాంతుని ప్రాణములను గొని
పోవుచున్నావా !

ఆహా ! ఏమీ ఈ సాధ్వీలలామ సాహసము
దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతముశైవించి
నన్ననుసరించు ఈమె స్థైర్యము సంస్తవనీయమైననూ..
అహో.. నిష్ప్రయోజనమే... కనుక.. చెప్పి చూచెదను గాక

కాలు మోపిన చాలు కస్సని అరికాలు
కోసుకుపోయెడి కూసురాళ్ళు
అలికిడైనను చాలు అదరి బుస్సున లేచి
పడగెత్తి పైబడు పాపరేళ్ళు
అడుగుపెట్టిన చాలు ఒడలు జిల్లున లాగి
నరములు కుదియించు నదుల నీళ్ళు
గాలి దోలిన చాలు కదలి ఘీ..యని కర్ణ
పుటములు ప్రేల్చెడి ముది వెదుళ్ళు

పులులు సింహాలు శరభాలు పోవ పోవ
కటిక చీకటి కనరాదు కాలిదోవ
మరలిపొమ్మిక విడువుము మగని ఆశ
మాట వినవేల ఓ బేల మరలవేలా..ఆఆ...

పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
నా వెంట రా తగదు రావలదు రా తగదు రావలదు
పోపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
లబోదిబోమని అఘోరించినా
లబోదిబోమని అఘోరించినా
ఫలితము సున్న మరలుము మెదలక
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్

పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !

ఆహా ! ఏమి ఈ బాల అచంచల మనఃస్థైర్యమూ
దుర్గమ కీకారణ్య సీమలనధిగమించుటయే గాక
మహోన్నత పర్వత శిఖరాగ్రమ్ముసైతమధిరోహించి
నన్ననుసరించుచున్నదే హొహ్హో మరియునూ
మరికొంచెము బెదరించి చూచెదను గాక

చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
సముండను పాశధరుండను
కాల యముండను ఆహ్హహ్హహ్హహ్హ...
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ ఫో..

ఆహో.. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా
బేలా సావిత్రీ ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిది
గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు
అరంఘనీయమైన వైతరణి అల్లది

అన్నియునూ తెలిసిన ధర్మ వేదులుమీరు
ఇంత దూరమేతెంచి రిక్త హస్తములతో తిరిగి పొమ్మందురా

మరి ఏమందును... హ్మహుహు ఇదియునూ నిక్కంబు
కనికరించి ఏదైనా ఒక్క వరంబునొసంగి పంపెద
సాధ్వీ నీ కార్యదీక్షతకు కడుంగడు సంతసించితి
నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా
మరొక్క వరంబు కోరుకొనుము ఇచ్చెద

ఈ యముని కర్కశ హృదయంబు
కూడా కరుగుచున్నట్లున్నది
ఇచ్చిన అవకాశమేల జారనీయవలె
స్త్రీలకు పుట్టినింటికన్నను మెట్టినిల్లే
ప్రధానమని కదా ఆర్యోక్తి

యమధర్మరాజా ఆ! రాజ్య భ్రష్టులై అంధులై
కారడవులందు కటకటంబడు మా అత్తమామలకు
  సరియ సరియ రాజ్య ప్రాప్తియూ నేత్ర దృష్టియూ
రెండునూ ఒసంగితిని పొమ్ము

ఆ ! వదలక వచ్చుచున్నదే
ఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను
మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా
కనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించి
ఊరడించి మరలించెద
సావిత్రీ అబలవన్న ఆదరంబున
ఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభున
మరొక్క వరంబీయ ఇచ్చగించితీ
అదియును నీ పతి ప్రాణంబు దక్క

ఆ ! ఇప్పుడు దారిన పడినాడు
ఈ అవకాశమును మాత్రమేల పోనీయవలె
కన్నవారి ఋణము తీర్చెద

సమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అని
అలమటించు నా జనకునకు

ఆ! ఇక చాలు బాబోయ్ అను అటుల
సుతశతంబనుగ్రహించితి
సంతుష్టవై మరలిపొమ్ము

ఒకటి నే కోరితి రెండు నీవిచ్చితి
ముచ్చటగా మూడవ కోర్కె
చెల్లించకుండుట పాడియే ధర్మమూర్తీ

ఊ ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే
ఐనను ఆఖరి కోరికని వాపోవుచున్నది ఇచ్చి పంపెద
సావిత్రీ స్వామీ అడుగుము
అదియును నీ పతి ప్రాణంబు దక్క

సంతానమును చూసియైనను
సంతసించు భాగ్యమును ప్రసాదింపుము
ప్రసాదించితిని పొమ్ము.. ఊ !
ఇంకెక్కడికి పోయెదవు
ఏమీ ! నా పతి ప్రాణంబులీయక
అడుగు వేయలేవు

ఏమీ అడుగువేయలేనా
మహిషరాజమా.. ఊ !..

ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష
యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననూ..
విలయ రుద్రుని ప్రళయ తాండావ ఘోష విన్ననూ
నెమరాపక అడుగు తప్పక తలతిప్పక ముందుకు సాగిపోవు
నా మహిషరాజము నేడేలనో తత్తరపాటున బిత్తరపోవుచున్నదే...

హహహహహహహ..

ఊ... నీవు సాధ్వీయే అనుకొంటిని ఇంద్రజాలవు కూడానా

ఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే

 ధర్మబద్ధమా... నాకు తెలియని ధర్మమా
యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా ఎటుల 

అమరులెటులైన సంతాన మందవచ్చు
మనుజ లోకాన సాధ్వులు మగడు లేక
పుత్రసంతాన మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !

ఆహా ! పతివ్రతా శిరోమణి యన్న వాత్సల్యంబున వచ్చియుంటిని
కాని ఇంతటి తెలివి గలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుండెడి
వాడను కదా గతంబునకు వగచి ప్రయోజనంబేమి కనుక

సాధ్వీ సావిత్రీ నీ పతి భక్తికి సమయస్ఫూర్తికీ
కడుంగడు సంతసించితి ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము హహహ

యముడంతవానినే తికమక బెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్ధము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించి తదనంతరంబున నా లోకంబున అహ్హ! కాదు కాదు స్వర్గ లోకంబున జేరి
తరింతురు గాక తరింతురు గాక తరింతురు గాక

నవ్వని పువ్వే నవ్వింది


నవ్వని పువ్వే నవ్వింది
చదరంగం (1967)
టి.వి.రాజు
ఘంటసాల, సుశీల

నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెదరాజును రమ్మంది
నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెదరాజును రమ్మంది
నవ్వని పువ్వే నవ్వింది

రమ్మంటేనే చాలదులే
నీ కమ్మని వలపులు కావాలీ
రమ్మంటేనే చాలదులే
నీ కమ్మని వలపులు కావాలీ
రమ్మంటేనే చాలదులే

మక్కువగొలిపి మనసులు చిలికి
మధువులు గ్రోలాలి నీవే
అలాగా...
మక్కువగొలిపి మనసులు చిలికి
మధువులు గ్రోలాలి నీవే

దాచిన తేనెలు దోచే సమయం
దాచిన తేనెలు దోచే సమయం
ఎన్నడు రానున్నదో

రమ్మంటేనే చాలదులే
నీ కమ్మని వలపులు కావాలీ
రమ్మంటేనే చాలదులే

ఇద్దరమొకటై సరే అనుకుంటే
పెద్దలు దీవింతురోయీ
ఇద్దరమొకటై సరే అనుకుంటే
పెద్దలు దీవింతురోయీ

అందాలొలికే పందిరి కింద
అందాలొలికే పందిరి కింద
బంధము వేసేరులే

ఇరువురి నడుమ దూరాలన్నీ
కరిగి పోయేనులే
నీలో నేనై నాలో నీవై
కలిసిపోయేములే

నవ్వని పువ్వే నవ్వింది
మనమిరువురినొకటై పొమ్మంది

నవ్వని పువ్వే నవ్వింది

వన్నెల చిన్నెల నెర


వన్నెల చిన్నెల నెర
చిత్రం :  శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :

వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి

వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి

చరణం 1 :

కని విని ఎరుగము గదా...  ఇది ఎంతో వింత సుమా
కని విని ఎరుగము గదా...  ఇది ఎంతో వింత సుమా
కాలులే సతికి కన్నులే గీటు చతురులే పెనిమిటైనా

వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి

చరణం 2 :

అలక లేలనె చెలీ...  అలవాటున పొరపాటదీ
అలక లేలనె చెలీ...  అలవాటున పొరపాటదీ
మురిసిపోవాలి చల్లని ఈ రేయి...  పరిమళించాలి హాయి

వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి

అహహహహహ.. ఓహొహొ ఓహొహొహో..
ఉమ్మ్..ఉమ్మ్.. ఉమ్మ్మ్

నీవని నేనని తలచితిరా


నీవని నేనని తలచితిరా
చిత్రం :  శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం :  టి.వి.రాజు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

    నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
    నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
    నిజమిదే....ఋజువేదీ...
    ఉహు..హు...ఆహా...హా...
    నీవని నేనని తలచితిరా....
    నీవే నేనని తెలిసితిరా ...

చరణం 1:

    కలయగ జూచితి నీకొరకై నే...కలయగ జూచితి నీకొరకై నే...
    కనుపాపలలో కనుగొన్నారా...కనుపాపలలో కనుగొన్నారా....
    అవునో... కాదో... నే చూడనా...
    నీవని నేనని తలచితినే...నీవే నేనని తెలిసితినే

చరణం 2:

    కలవర పాటున కల అనుకొందూ..కలవర పాటున కల అనుకొందూ...
    కాదనుకొందు కళా నీ ముందూ...కాదనుకొందు కళా నీముందూ...
    కాదు సఖా కల నిజమేలే.....
    నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
    నీవే నేనని తెలిసితిరా ...

    ఆహ...ఆహ..హా...హా....ఉమ్మ్...ఉమ్మ్..ఉమ్మ్...

సై సై జోడెడ్లా బండి


సై సై జోడెడ్లా బండి
చిత్రం: వరకట్నం (1968)
సంగీతం::టి.వి.రాజు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల

పల్లవి::

సై సై జోడెడ్లా బండి..బండి
హోయ్..షోకైన దొరలా బండి
ఖంగు ఖంగు మని గంటలబండి
ఘల్లు ఘల్లుమని గజ్జెలబండి
చుట్టుపక్కల పన్నెండామడ దీనికి
పోటీ లేదండీ..
మహా ప్రభో..

చరణం::1

కంటికాటుకెట్టి గట్లున్న గడ్డికోసి
గుత్తంగా రైక తొడిగి కొడవలేసి కోతకు వంగే
వగలాడి వోరగ చుస్తే వులిక్కి పడతవి నా యెడ్లు
మహాప్రభో..

చరణం::2

నెత్తిన బుట్టపెట్టి అడుగులో ఆడుగులేసి
సరదాగా సరసాలాడుతు
పరిగెడుతూ పకపకలాడే
నెరజాణ సైగల చూస్తే కనబడదూ ముందు దారి
మహాప్రభో

చరణం::3

మట్టగోసె గట్టిగ దోపి మట్టితట్ట పైకి లేపి
ఈలవేసి బడమీద ఒడుపుగ జబ్బమీద పై దెబ్బవేసే
చిలుకలకొలికి కులుకుతు ఉంటే
జల్లుజల్లు మంటది నా ఒళ్ళూ..
మహా ప్రభో..

ఆలపించనా అనురాగముతో

ఆలపించనా అనురాగముతో
చిత్రం: పిచ్చి పుల్లయ్య (1953)
గీతరచయిత: అనిసెట్టి సుబ్బారావు
నేపధ్య గానం: ఘంటసాల
సంగీతం: టి.వి.రాజు

పల్లవి:

ఆలపించనా అనురాగముతో...
ఆలపించనా అనురాగముతో...
ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా...
ఆలపించనా... ఆలపించనా

చరణం 1:

చక్కని పూవులు విరిసి ఆడగా...
చల్లని గాలులు కలిసి పాడగా
పున్నమి వెన్నెల పులకరించగా...
పుడమిని సుఖాలు పొంగులెగయగా...
ఆలపించనా

చరణం 2:

చిలిపి గుండెలో వలపు నిండగా...
చిరునవ్వులలో సిగ్గు చిందగా
చిలిపి గుండెలో వలపు నిండగా...
చిరునవ్వులలో సిగ్గు చిందగా
అరమరలెరుగని అమాయకునిలో...
అరమరలెరుగని అమాయకునిలో
ఆశయాలెవో అవతరించగా...
ఆశయాలెవో అవతరించగా
ఆలపించనా....

చరణం 3:

కరుణ హృదయమే తాజ్ మహల్గా...
అనంత ప్రేమకు ఆశ చెందగా
కరుణ హృదయమే తాజ్ మహల్గా...
అనంత ప్రేమకు ఆశ చెందగా
నిర్మలప్రేమకు నివాళులెచ్చే...
నిర్మలప్రేమకు నివాళులెచ్చే
కాంతిరేఖలే కౌగలించగా....
కాంతిరేఖలే కౌగలించగా
ఆలపించనా ...

ఆలపించనా అనురాగముతో...
ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా...
ఆలపించనా

సిక్కేవులేరా సక్కని రాజా


సిక్కేవులేరా
రాజనందిని (1958)
సంగీతం: టి.వి.రాజు
గానం: జిక్కి, పిఠాపురం
రచన: మల్లాది

పల్లవి:

సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా

సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా

కళ్ళల్లో సిక్కాలల్లి కమ్ముకురానా
దారుల్లో ఒంటిగ చేసి దోచుకుపోనా
కళ్ళల్లో సిక్కాలల్లి (చిట్కాలల్లి) కమ్ముకురానా
దారుల్లో ఒంటిగ చేసి దోచుకుపోనా

జంతరివైతే మంతరముంటే
సిక్కేనే సివంగి కూనా

గుడు గుడు గుంచం


గుడు గుడు గుంచం
చిత్రం: ధనమా? దైవమా? (1973)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఏమిటో ఇది... ఏమిటో... ఎందుకో ఇది.... ఎందుకో
గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం
ఇది తొలి వయసు వేసిన తాళం
ఇది తొలి వయసు వేసిన తాళం
గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం

చరణం 1:

నీ కళ్ళు చూసాను... నా ఇల్లే మరిచాను
నీ కళ్ళు చూసాను... నా ఇల్లే మరిచాను
నీ పెదవులే చూసాను...
నీ పెదవులే చూసాను...జున్ను... మీగడ మరిచాను ...ఎందుకో...

గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంచం హెహె... గుండెరాగం

చరణం 2:

నీ రూపం చూశాను... ఈ లోకం మరిచాను
నీ రూపం చూశాను... ఈ లోకం మరిచాను
నా పేరే అడుగుతుంటే...
నా పేరే అడుగుతుంటే... నీ పేరే తెలిపాను... ఎందుకో...

గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంచం ఆ...హ్హ... గుండెరాగం

చరణం 3:

నిద్దురలో పిలిచాను... ముద్దులతో కొలిచాను
నిద్దురలో పిలిచాను... ముద్దులతో కొలిచాను
నీ కౌగిట కరిగిపోయి...
నీ కౌగిట కరిగిపోయి...నిన్ను.. నన్ను.. మరిచాను...ఆ..హా..

గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంచం అహ్హ... గుండెరాగం...
ఆహ..ఆ....హె...హే....

నీ మీద మనసాయెరా


నీ మీద మనసాయెరా
రాజనందిని (1958)
టి.వి.రాజు
సముద్రాల రాఘవాచార్య
సుశీల

పల్లవి:

నీ మీద మనసాయెరా ఆ ఆ ఆ
నీ మీద మనసాయెరా ఓ రేరాజ నీదానరా
కన్నార మన్నించరా ఆ ఆ
నను కన్నార మన్నించరా
నీ మీద మనసాయెర ఓ రేరాజ నీదానరా
కన్నార మన్నించరా ఆ ఆ
నను కన్నార మన్నించరా
నీ మీద మనసాయెర

చరణం1:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరజాజినై నీ చిరునవ్వునై
మురిసేర సరసున మెరిసేనురా
దరిచేరరార మనసీయరా
దరిచేరరార మనసీయరా
రేరాజ నీదానరా
నీ మీద మనసాయెర ఓ రేరాజ నీదానరా
కన్నార మన్నించరా ఆ ఆ
నను కన్నార మన్నించరా
నీ మీద మనసాయెర

చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ వెన్నెలేను సొగసౌనురా
నీవన్నెలేను సొమ్మవునురా
దరిచేరరార మనసీయరా
దరిచేరరార మనసీయరా
రేరాజ నీదానరా
నీ మీద మనసాయెర ఓ రేరాజ నీదానరా
కన్నార మన్నించరా ఆ ఆ
నను కన్నార మన్నించరా
నీ మీద మనసాయెర